ఏపీ: పింఛన్దారులకు బ్యాడ్ న్యూస్.. ఏకంగా మూడు లక్షల మంది అవుట్..!
300000 మంది పై అనార్హత వేట వేయబోతోంది కూటమి ప్రభుత్వం ఈ విషయం తెలిసి చాలా మంది పింఛనీదారులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ పింఛన్దారున్ని కూడా తీసేయమని చెప్పి ఇప్పుడు కొత్త పింఛన్దారుల కోసం మూడు లక్షల మందిని తొలగిస్తారా అంటూ పెదవి విరిస్తున్నారు. ఈ విషయం కూటమి ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది కలిగించేలా ఉందని చెప్పవచ్చు. టిడిపి పాలనలోని 2014లో 200గా ఉన్న పింఛనీ డబ్బులను ఒకేసారి రెండు వేలకు పెంచామని ఇప్పుడు మళ్లీ 4,000 రూపాయలకు పెంచిన ఘనత మాదే అంటూ తెలుపుతున్నారు.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం 1000 రూపాయలు మాత్రమే పెంచిందని అది కూడా నాలుగు దశలలో పెంచారని తెలియజేశారు. అనర్హులకు పించినిని తొలగిస్తే అర్హులకు న్యాయం జరుగుతుందని భావించామని తెలియజేశారు. కొంతమంది ధృవపత్రాలు సంపాదించి దివ్యాంగులు కాని వారికి కూడా వైద్యుల చేత ఇప్పించుకున్నారని ఇవన్నీ కూడా అనర్హులని గుర్తించేందుకే ప్రభుత్వం ఒక తనిఖీ చేస్తోంది అంటూ తెలియజేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి అర్హులైన వారందరికీ కూడా పింఛనీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మూడు నెలల పాటు గ్రామంలో అందుబాటులో లేకపోతే వారికి శాశ్వత వలసదారుగా గుర్తించి తాత్కాలికంగా నిలిపివేస్తాము ఆ పించి నేనే అంటూ తెలియజేశారు.