అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ చూడ్డానికి ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తారు.. కానీ ఈయన చేసిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోయినప్పటికీ ఈ సినిమా క్రెడిట్ మొత్తం పూజ హెగ్డే తన ఖాతాలో వేసుకుంది. అయితే అలాంటి అఖిల్ ఎంతోమంది అమ్మాయిలకు ఫేవరెట్ అయినప్పటికీ ఆయన సినిమాలు హిట్ అవ్వకపోవడం కాస్త బాధ కలిగించే వార్త.ఇక అఖిల్ హిట్ కోసం ఎన్నో పాట్లు పడుతున్నాడు. త్వరలోనే అఖిల్ ఓ కొత్త సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కూడా ఫిక్స్ అయినట్టు టాక్ నడుస్తోంది. అయితే హీరోలపై హీరోయిన్లు మనసు పడడం కామన్.అలాగే హీరోయిన్లపై హీరోలు మనసు పడడం కామన్.
అయితే ఓ పెళ్లైన హీరోయిన్ మాత్రం యంగ్ హీరో అఖిల్ పై తనకున్న ఇష్టాన్ని బయట పెట్టింది.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు జాంబిరెడ్డి,ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం, శ్రీదేవి సోడా సెంటర్ వంటి సినిమాల్లో చేసిన నటి ఆనంది.. ఈ హీరోయిన్ కి అందం,అభినయం ఉన్నప్పటికీ తెలుగులో అంతగా అవకాశాలు లేక తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళింది.ఇక అక్కడ ప్రేక్షకులు ఈమెకు బ్రహ్మరథం పట్టారు. దాంతో కోలీవుడ్లో ఫేమస్ అయిపోయింది. ఇక తెలుగులో కూడా ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని అవకాశాలు అందుకుంటుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ పై తనకున్న ఇష్టాన్ని బయట పెట్టింది.
అయితే తాజాగా ఓ షోలో ఆనంది అక్కినేని అఖిల్ గురించి మాట్లాడుతూ.. మీ అందాన్ని చూస్తుంటే ఇంత తొందరగా పెళ్లెందుకు చేసుకున్నానా అనిపిస్తుంది అంటూ మాట్లాడింది. ఇక ఆమె మాటలకి అఖిల్ సైతం ఆశ్చర్యపోయి ఇంత అందమైన అమ్మాయి నాకు అభిమానిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.. అయితే హీరోయిన్ ఆనందికి ఇప్పటికే పెళ్లయి ఒక బేబీ కూడా ఉంది. కానీ ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.అలా అఖిల్ అందాన్ని చూసి మనసు పడిన హీరోయిన్ ఆనంది తొందరగా పెళ్లి చేసుకుని తప్పు చేశాను అంటూ మాట్లాడడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది