హెరాల్డ్ టాలీవుడ్ డిజాస్టర్లు 2024: భారతీయుడు 2 తో కమల్ కు భారీ నష్టం..?
ఈ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించారు. భారతీయుడు సినిమాకు సీక్వల్ గా ఈ సినిమాను తీశారు దర్శకుడు శంకర్. ఇక ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్ ఇలా చాలామంది పెద్ద నటీనటులే నటించడం జరిగింది. 260 కోట్లతో ఈ సినిమాను భారీగా భారీగా తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి.టైం కూడా బాగానే తీసుకుంది.
భారతీయుడు సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని అనుకున్నారు. కానీ రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ గా మిగిలింది. ఈ సంవత్సరము జూలై 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 సినిమాను రిలీజ్ చేశారు. అయితే మొదటి రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో...సినిమా తేలిపోయింది. దీంతో భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
260 కోట్లతో ఈ సినిమా తీస్తే... కనీసం 500 కోట్లు వస్తాయని అందరం అనుకున్నారు. కానీ సినిమా లైన్ నచ్చకపోవడంతో జనాలు అసలు పట్టించుకోలేదు. దీంతో 150 కోట్లకు పైగా మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో 83 కోట్లు కేవలం ఇండియాలోనే రావడం గమనార్ధం. కమలహాసన్ నటించిన తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టిందట. అటు ott ప్లాట్ఫారం లో కూడా పెద్దగా రేటు రాలేదని సమాచారం. ఈ తరుణంలోనే... 2024 సంవత్సరంలో.... కమల్ హాసన్ అలాగే దర్శకుడు శంకర్ కు నిరాశ ఎదురయింది.