రాజమౌళి దివంగత‌ ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్.. ఈ మూవీ పడుంటే కెరీర్ మరోలా ఉండేదేమో ..?

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమలో దివంగత ఉదయ్ కిరణ్ ధ్రువతారలా వెలిగాడు .. మొదటి సినిమా చిత్రంతోనే భారీ హిట్స్ సొంతం చేసుకున్నాడు .. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు .. ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు .. అంతేకాకుండా ఈ సినిమాతో క్రేజ్ ఊహించని రేంజ్ లో పెరిగిపోయింది .. ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్డ్ గా నిలిచింది .. వరుసగా మూడు బ్లాక్ బస్టర్ ల‌తో టాలీవుడ్ లోనే ఉదయ్ కిరణ్ పేరు మారుమోగిపోయింది . అలా టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ కు తిరిగి ఉండదని అంతా అనుకున్నారు ..

స్టార్ హీరో రేంజ్‌కి వెళ్ళిపోతారని భావించారు .. అక్కడే విధి ఉదయ్ కిరణ్ ను విధి నమ్మించి మోసం చేసింది .. అనూహ్యంగా వరుస ప్లాఫ్ లు ఉదయ్ కిరణ్ కెరియర్ను ప్రశ్నార్ధకంగా మార్చాయి .. ఎన్ని సినిమాలు చేసిన ఆయన కోరుకున్న విజయం దక్కలేదు .. మార్కెట్ కూడా బాగా పడిపోయింది .. అవకాశాలు కూడా తగ్గటంతో మనస్థాపానికి  గురైన‌ ఉదయ్ కిరణ్ మానసిక శోభకు గురై ఆత్మహత్య చేసుకుని శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు . ఇక చిత్ర పరిశ్రమ లో ఎంత వేగంగా ఎదిగాడు అంతే వేగంగా కిందకి పడిపోయాడు ఉదయ్ కిరణ్ .. ఇందుకు తన స్వీయ తప్పులు కూడా కారణమని కొందరు అంటారు .. ఉదయ్ కిరణ్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నాడని అప్పుడప్పుడు వార్తలో వినిపిస్తూ ఉంటాయి ..

ఇక అందులో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా కూడా ఒకటి ఉందట .. అప్పటికే యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకొన్న‌ ఉదయ్ కిరణ్ తో రాజమౌళి కూడా ఒక సినిమాను ప్లాన్ చేశాడు .. ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తెర్కక్కిస్తున్న సమయంలోనే స్టోరీని కూడా రాసుకున్నాడట.  అయితే తర్వాత ఏమైందో తెలియదు కానీ ఉదయ్ కిరణ్ ప్లేస్ లో నితిన్ ను హీరోగా తీసుకున్నారట .. ఇంత‌కి ఆ సినిమా ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు  ... సై సినిమా ఈ మూవీ కనుక నితిన్ కు బదులు ఉదయ్ కిరణ్ కు పడుంటే ఆయన కెరియర్ మరోలా ఉండేదని విషయం నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ ఆయన్ను తలచుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: