గౌతు లచ్చన్న, ఎన్టీఆర్ కొందరి వాళ్లు కాదు... శిరీష చేసిన తప్పేంటి..?
గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కాక రేపుతున్న విషయం.. టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో.. ము ఖ్యంగా టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్న కార్యక్రమంలో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమే ష్ పాల్గొనడం. వారితో కలిసి భుజం భుజం రాసుకునేలా వ్యవహరించడం. దీనిపై టీడీపీ హార్డ్ కోర్ నేతలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అసలు జోగితో కలిసి కార్యక్రమాల్లొ పాల్గొనడం ఏంటని కూడా వారు నిలదీస్తున్నారు. అయతే.. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. జోగి అయినా.. మరొకరైనా.. పాల్గొన్న కార్యక్రమం ప్రాధాన్యం ఏంటనేది చూడాలి.
టీడీపీ నాయకులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఉండొచ్చు. కానీ, ఆ కార్యక్రమం.. స్వాతంత్య్ర సమరయో ధుడు, సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం. సో.. ఈ కార్యక్రమంలోనే జోగి రమేష్ పాల్గొన్నా రు. ఇది పార్టీలకు అతీతంగా జరగకపోయినా.. గౌతు లచ్చన్నను ప్రజలు పార్టీలకు అతీతంగానే అభిమా నించారు. ఇప్పటికీ అభిమానిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆయన చిరస్థాయి నాయకుడు. దేశానికి బాపూజీ మాదిరిగా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో లచ్చన్నకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది.
ఇక, బీసీ సామాజిక వర్గంలోనూ..లచ్చన్నకు ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. బీసీ వర్గాలకు ఆయ న చేసి మేళ్లు.. గౌడ సామాజిక వర్గాన్ని రాజకీయంగా ముందుండి నడిపిన తీరు వంటివి ఆయనను ఐకాన్ నాయకుడిగా నిలబెట్టా. ఇదే.. ఆయనను పార్టీలకు, వర్గాలకు అతీతంగా ప్రజలకు చేరువ చేసింది. అందుకే.. పార్టీలు ఏవైనా.. నాయకులు ఎవరైనా గౌతు లచ్చన్న కార్యక్రమం అంటే.. ఒక గాంధీలెక్క మాదిరిగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీనికి ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
అనేక ఉదాహరణలు..
గౌతు లచ్చన్నను ఒక పార్టీకి, ఒక కుటుంబానికి పరిమితం చేయాలన్న వుద్దేశం ఎప్పటికీ సరికాదన్న చ ర్చ జరుగుతోంది. ఎందుకంటే.. మన రాష్ట్రంలోనే అన్నగారు ఎన్టీఆర్ నుంచి వైఎస్ , పుచ్చలపల్లి సుంద రయ్య దాకా.. కొందరు నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా.. ఆయా వర్గాలకు చేరువ అయ్యారు. ఇక్కడ కులం, మతం.. ప్రాతిపదికన కాకుండా.. వారు.. నేరుగా తమ సేవలతో.. ఆలోచనా దృక్ఫథంతో ప్రజలను మచ్చిక చేసుకున్నారు. చిరస్థాయి గౌరవాన్ని పొందారు.
ఉదాహరణకు ఎన్టీఆర్‌ను తీసుకుంటే.. కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఆయనను ఓన్ చేసుకోలేదు. అదే విధంగా టీడీపీ మాత్రమే సొంత చేసుకున్నా.. ఇతర పార్టీలు కూడా.. ఆయనను గౌరవించాయి. టీడీపీకి బద్ధ శత్రువు వైసీపీనే తన హయాంలో ఒక జిల్లాకు ఎన్డీఆర్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇక, తెలం గాణలోనూ.. బీఆర్ ఎస్ నాయకులు కూడా.. ఎన్టీఆర్‌ను గౌరవిస్తారు. కాంగ్రెస్ నాయకులు కూడా అభిమా నించే వారు ఉన్నారు. వైఎస్ విషయంలోనూ అంతే. ఆయన కాంగ్రెస్ నాయకుడే అయినా.. పార్టీలకు అతీతంగా అభిమానించే ప్రజలను సొంతం చేసుకున్నారు.
సో.. ఇలానే గౌతు లచ్చన్న వ్యవహారం కూడా. ఆయన భావాలు, ఆదర్శాలకు ముగ్ధులైన వారు కొందరైతే.. సామాజిక వర్గానికి చేసిన సేవను గుర్తుంచుకున్నవారు మరికొందరు. కాబట్టి.. లచ్చన్నకు సంబంధించి ఏకార్యక్రమం ఎవరు చేసినా.. అది గుడిలో పెళ్లిలాంటిదే! అంటే..ఎవరూ ఎవరిని ఆహ్వానించినా.. ఆహ్వానించకపోయినా.. వారు వస్తారు. ఆయనపై తమకు ఉన్న అభిమానం చాటుకుంటారు.
ఈ మాత్రానికే.. జోగి విషయంలో ఇంత రాద్ధాంతం చేయడం.. ఆయన మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు చేయడం సరికాదని అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా జోగి రమేష్ కూడా.. సామాజిక వర్గం పరంగా.. గౌడకు చెందిన నాయకుడే. ఆయన కూడా.. గతంలోనూ గౌతు లచ్చనను కొనియాడిన సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో చంద్రబాబును విమర్శించారు.. ఇది రాజకీయం. ఈ క్రమంలోనే టీడీపీ నిర్వహించినా.. మరొకరు నిర్వహించినా.. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కానీ, దీనికి గౌతు శిరీషను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం.. బీసీ మహిళ అని కూడా.. చూడకుండా.. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. పైగా.. ఆమె తన నిబద్ధతను.. జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించి.. భవిష్యత్తులో జాగ్రత తీసుకుంటానని చెప్పినత ర్వాత కూడా.. ఇలా ఆమెపై విమర్శలు చేయడం సరికాదని అంటున్నారు పరిశీలకులు.