షాక్: మోహన్ బాబుకు హైకోర్టు షాక్.. బెయిల్ ఇవ్వద్దంటూ..?
జర్నలిస్టు పైన దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బయలు సైతం అప్లై చేయగా ఈ రోజున హైకోర్టు విచారణ జరిపించారు.. ఆ జర్నలిస్ట్ తరఫున న్యాయవాది సైతం వాదిస్తూ.. అటెంప్ట్ టూ మర్డర్ కేసు పెట్టడంతో మోహన్ బాబు జర్నలిస్టును వెళ్లి హాస్పిటల్లో కలిశారని.. అంతేకాకుండా నటుడు మోహన్ బాబు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగలిగిన వ్యక్తి అని ముందస్తు బెయిల్ ఇవ్వద్దు అంటూ కోర్టులో జర్నలిస్టు తరుపున న్యాయవాది వాదించారట.. అరెస్టు చేస్తారనే భయంతోనే మోహన్ బాబు దుబాయ్ కి పారిపోయారు అంటూ లాయర్ తెలిపారు.
అయితే ఇంతకు కౌంటర్ గా మోహన్ బాబు తరపున న్యాయవాది మాట్లాడుతూ.. మోహన్ బాబు ఎక్కడికి పారిపోలేదని సోమవారం వరకు అరెస్టు చేయకుండా రిలీఫ్ ఇవ్వాలి అంటూ తెలియజేశారు. అయితే మోహన్ బాబు ఇక్కడే ఉన్నాడు అన్న విషయాన్ని అఫీడబిట్ లో దాఖలు చేయాలి అంటూ హైకోర్టు వెల్లడించింది.. అప్పుడే కౌంటర్ దాఖలు చేసిన తర్వాత తీర్పు ఇస్తామంటూ మోహన్ బాబు లాయర్ కు సైతం హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.ఇక తదుపరి విచారణ సైతం సోమవారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ నోటీసులకు స్పందించకపోతే కచ్చితంగా అరెస్టు చేస్తారని కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. మొత్తానికి మోహన్ బాబుకు కేసు విషయంపై హైకోర్టు షాక్ ఇస్తోంది.