అరకు: శభాష్ తనూజా.. తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్థి!

Purushottham Vinay
మే 13 వ తేదీన జరిగిన అసెంబ్లీ ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యి టీడీపీ కూటమి ఘన విజయం సాధించి వైసీపీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. వైసీపీ పరువు చాలా దారుణంగా పోయింది. కానీ ఆ పరువుని కొంచెం నిలబెట్టింది మహిళా నేత. అది కూడా తన మొదటి ప్రయత్నంలోనే.ఆమె గెలుపుని చూసి వైసీపీ ఫ్యాన్స్ శభాష్ అంటున్నారు.అరకు ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన గుమ్మా తనూజా రాణి 477005 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై 50580 ఓట్ల తేడాతో గెలుపొందారు.కౌంటింగ్ జరుగుతున్న క్రమంలోనే  ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీకి చెందిన గుమ్మా తనూజా రాణి ఆధిక్యంలో ఉండగా, బీజేపీకి చెందిన కొత్తపల్లి గీత వెనుకంజలో ఉన్నారు. అరకు ఓట్ల లెక్కింపు తొలిదశలోనే వైఎస్సార్‌సీపీకి చెందిన గుమ్మా తనూజా రాణి ఆధిక్యంలో ఉండగా, బీజేపీకి చెందిన కొత్తపల్లి గీత వెనుకంజలో ఉన్నారు. ఫలితంగా భారీ అధిక్యంతో తనూజా గెలవడం జరిగింది.


లోక్‌సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా తనూజారాణి, ఆమె ప్రత్యర్థిగా కూటమి మద్దతుతో బీజేపీ నేత కొత్తపల్లి గీత ఈరోజు అదృష్టం పరీక్షించుకోగా...తనూజారాణి తొలి ప్రయత్నంలోనే గెలిచారు. వైసీపీ పరువు నిలబెట్టి ఆ పార్టీకి దేవతలా మారారు. తనూజా బాగా చదువుకున్నారు.గౌరవ ప్రధమైన డాక్టర్ వృత్తిలో ఉండి రాజకీయాల్లోకి వచ్చి ఎంపిగా గెలిచారు. ఇక గీత కూడా గతంలో ఎంపీగా పనిచేశారు. గత రెండు ఎన్నికల్లో కూడా అరకు నుంచి వైసీపీయే గెలిచింది. దీంతో ఈ స్థానంలో హోరాహోరీ పోటీ అనేది నెలకొంది. ఇక రంపచోడవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మికి మరోసారి అవకాశం దక్కగా, ఆమెకు దీటైన అభ్యర్థిగా అంగన్‌వాడీ మాజీ కార్యకర్త శిరీషను బరిలోకి దింపింది వైసీపీ. ఇదే సీటును టీడీపీ నుంచి మరో మహిళా నేత వంతం రాజేశ్వరి ఆశించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: