సత్యవేడు: టిడిపి హవా.. జగన్ చేసిన తప్పు అదే..!

Divya
ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలు అత్యంత కీలకమని అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ఎవరికీ వారు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ప్రజలతో మమేకమవుతూ అధికారంలోకి రావాలని పలు ప్రయత్నాలు చేశారు.. ఇక ఆ ప్రయత్నాలు కూటమికి ఫలించాయి అని చెప్పాలి.. ఏకంగా 163 సీట్లను కైవసం చేసుకొని రికార్డు బ్రేక్ చేసింది కూటమి.. ఇక అందులో భాగంగాలే పలు నియోజకవర్గాలలో అత్యంత భారీ మెజారిటీతో కూటమి గెలుపొందడం జరిగింది. ఈ క్రమంలోనే సత్యవేడులో ఎవరు గెలిచారు అనే విషయం అందరిలో ఉత్కంఠ గా మారింది.

 
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సత్యవేడు  నియోజకవర్గం ఆంధ్ర , తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. రెండు రాష్ట్రాల కల్చర్ సత్యవేడులో విలసిల్లుతోంది. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్..ఈ సెగ్మెంట్ పరిధిలో నారాయణవనం, బి ఎం కండ్రిగ ,పిచ్చాటూర్, సత్యవేడు ,నాగలాపురం , కేవీబీ పురం, వరదయ్యపాలెం మండలాలు ఉన్నాయి. సత్యవేడులో మొత్తం 2,02,771 ఓటర్లు ఉన్నారు.. ఇక సత్యవేడు నియోజకవర్గ మొదటి నుంచే టిడిపికి కంచుకోట.. 1962 నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఏకంగా ఆరుసార్లు కాంగ్రెస్ ఐదు సార్లు ఒకసారి ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించగా.. 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలం విజయం సాధించారు ఇక రికార్డు స్థాయి మెజారిటీతో టిడిపి కంచుకోట ను బద్దలు కొట్టడం అక్కడ అనివార్యమైంది.. ఎన్నికల్లో 44 ,744 ఓట్ల మెజారిటీతో ఆదిమూలం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు.

ఇక 2024 ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి టికెట్ నిరాకరించిన జగన్ ప్రభుత్వం ఆయనను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది... సత్యవేడు అభ్యర్థిగా నూక తోట రాజేష్ ను ప్రకటించారు.. కానీ లోక్సభ ఎన్నికల్లో పోటీకి ససేమిరా అని ఆదిమూలం అనడమే కాకుండా రోజుల వ్యవధిలోని టిడిపిలో చేరారు. వెంటనే చంద్రబాబు కోనేటి ఆదిమూలం కు సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ నూక తోటి రాజేష్ పై కోనేటి ఆదిమూలం టిడిపి తరఫున పోటీ చేసి 3, 739 ఓట్ల ఆదిత్యతో గెలుపొందారు.. జగన్ చేసిన ఈ చిన్న తప్పిదం వల్ల ఇక్కడొక సీట్ ని కోల్పోయారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: