ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్ కొంత గ్యాప్‌తో ఇప్పుడు రెట్టింపు ఎనర్జీతో వస్తుంది. అయితే ఆమె రెట్టింపు ఎనర్జీతో, డబుల్ డోస్‌తో వస్తున్నట్టు తెలుస్తుంది.నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో టాలీవుడ్‌లో బిగ్ సక్సెస్‌ని అందుకుంది. అంతకు ముందు నుంచే గ్లామర్ షోలో హద్దులు చెరిపేసి సోషల్ మీడియాలో దుమారం రేపింది. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు తెలుగులో నిలబడేందుకు ప్లాన్ చేసుకుంది.అయితే వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య కారణాలతో ఆమె కొంత కాలం బ్రేక్ తీసుకుందట. మధ్యలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు నెమ్మదిగా మళ్లీ వస్తుంది. ప్రియదర్శితో కలిసి కమ్ బ్యాక్ అవుతుంది నభా నటేష్. ఇటవలే డార్లింగ్ అనే చిత్రాన్ని ప్రకటించారు. `హనుమాన్`నిర్మాతలు ఈ మూవీని
నిర్మించడం విశేషం.తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం గురించి తాజా అప్డేట్స్ చూద్దాం.పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా, శ్రీమతి చైతన్య సమర్పణలో, వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న చిత్రం 'డార్లింగ్' .బలగం ఫేమ్ టాలీవుడ్ యువ నటుడు ప్రియదర్శి, నభా నటేష్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'డార్లింగ్'. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా..హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత భార్య చేతిలో కీలు బొమ్మగా మారిన భర్తల స్టోరీగా ఈ సినిమా రానున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్‌కు తాజాగా గుమ్మడికాయ కొట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక ఫొటోను కూడా విడుదల చేసింది.
వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘుబాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.