వివేకా రెండో పెళ్లి.. షర్మిళ, సునీత ఎందుకు మాట్లాడరు?

Chakravarthi Kalyan
మాజీ మంత్రి, జగన్  చిన్నాన్న వైఎస్ వివేకానందా రెడ్డి హత్య జరిగి సుమారు ఐదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఆయన హత్యకు సంబంధించిన వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారమే రేగుతోంది. ముఖ్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులతో పాటు, సొంత కుటుంబానికి చెందిన వారు తరచూ విమర్శలు చేయడం.. ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా చేసుకొని పదే పదే విమర్శలు చేయడం వైసీపీకి, జగన్ కు ఇబ్బందిగా మారాయి.

వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ చిన్నాన్న కుమారుడు, అవినాశ్ రెడ్డిని జగన్ కాపాడుతూ వస్తున్నారని.. మళ్లీ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారని జగన్ సోదరి.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తో పాటు వివేకా కుమార్తె సునీతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో ఉన్న షర్మిళ ఈ ప్రచారంతోనే జగన్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు షర్మిళ, సునీతతో పాటు మరోవైపు చంద్రబాబు కూటమి నేతలు ఇదే అంశాన్ని తీసుకునే పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక తట్టుకోలేక సీఎం జగన్ తొలిసారి వీటిపై స్పందించారు.  పులివెందులలో జరిగిన సభలో షర్మిళ, సునీతలు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన చెల్లెలు పసుపు చీర కట్టుకొని ప్రత్యర్థుల దగ్గర మెకరిల్లారని విమర్శలు చేశారు.

ప్రతపక్షాల కుట్రలో నా చెల్లెళ్లు ఇద్దరు భాగస్వాములు కావడం బాధ కలిగించిందన్నారు. వివేకా చిన్నాన్నకు రెండో పెళ్లి అయింది వాస్తవమని.. ఆయనకు కూడా పిల్లలు ఉన్నారని, వైఎస్ అవినాశ్ ను రాజకీయంగా బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఆయన అమాయకుడని అందుకే తిరిగి ఎంపీ టికెట్ ఇచ్చారని స్పష్టం చేశారు. ఇంతకీ వైఎస్ వివేకాకు రెండో వివాహం జరిగి పిల్లలు పుట్టారనే విషయం సునీతకు, షర్మిళకు తెలియదా. జగన్ చెప్పేది అబద్ధమా? అయితే వీరు బయటకు వచ్చి నిజం చెప్పాలి. లేకపోతే వీరు ఒకవైపే ఉన్నట్లు భావించాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: