కడప: సంచలన సర్వే.. ప్రజలంతా ఆ పార్టీ వైపేనా.?

Pandrala Sravanthi
కడప జిల్లా పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది వైయస్ రాజశేఖర్ రెడ్డి.  ఈ జిల్లా ఈ ఫ్యామిలీకి కంచుకోట. అలాంటి కడప జిల్లాలో ఈసారి పరిస్థితులు చాలా మార్పు చెందాయట.  మరి ఈ జిల్లాలో  ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఒక సంచలన సర్వే బయటకు వచ్చింది. కేకే సర్వే స్టాటజీస్ అందించిన సమాచారం ప్రకారం ఆ జిల్లాలో ఎవరు గెలవబోతున్నారు అనే వివరాలు చూద్దాం.
 బద్వేల్:
 కూటమి అభ్యర్థిగా బొజ్జ రోషన్న బరిలో ఉండగా, దాసరి సుధా వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. ఈసారి బద్వేల్ లో తప్పక వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేస్తుందని సర్వేలో తేలింది.
 రాజంపేట:
 కూటమి అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యం పోటీ చేయగా, వైసిపి నుంచి ఆకేపాటి అమర్నాథ్ బరిలో ఉన్నారు.  ఈసారి రాజంపేటలో కూటమి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది.
 కోడూరు:
 ఇది ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. కూటమి నుంచి అరవ శ్రీధర్ బరిలో ఉండగా, కురుమట్ల శ్రీనివాసులు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు మధ్య చాలా హోరాహోరీ పోటీ ఉంది.  
 రాయచోటి:
 కూటమి అభ్యర్థిగా ఏం రాంప్రసాద్, వైయస్సార్సీపి నుంచి శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అని రాయచోటి ప్రజలంతా వైయస్సార్సీపీకే ఎక్కువగా మొగ్గు చూపే విధానం కల్పిస్తోంది.
 జమ్మలమడుగు:
 కూటమి తరపున ఆదినారాయణ రెడ్డి బరిలో ఉండగా,  వైయస్సార్సీపి నుంచి డాక్టర్ సుధీర్ రెడ్డి కాంటెస్ట్ లో ఉన్నారు. ఇద్దరు మధ్య హోరాహోరీ పోటీ ఉంది.
 కడప:
 కడప టౌన్ లో మాధవి రెడ్డి కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. వైయస్సార్సీపి నుంచి భాషా భాయ్ పోటీ చేస్తున్నారు.  కానీ గెలిచేది వైసిపి అభ్యర్థి అని ఇప్పటికే తేలిపోయింది.
 కమలాపురం:
 కూటమి తరపున చైతన్య రెడ్డి బరిలో ఉండగా, వైసిపి నుంచి రవీంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ ఉంది.
 పొద్దుటూరు:
కూటమి నుంచి వరదరాజుల రెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి రచ్చ మల్లు శివప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య కూడా నువ్వా నేనా అనే విధంగా ఫైట్ ఉంది.
 మైదుకూరు:
 కూటమి అభ్యర్థిగా పుట్టా సుధాకర్  యాదవ్ పోటీలో ఉన్నారు. వైసిపి నుంచి రఘురాం రెడ్డి బరిలో ఉన్నారు. వీరి మధ్య కూడా విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది ఎవరు గెలుస్తారని చెప్పడం కష్టంగా మారింది.
 పులివెందుల:
 ఇక కడప జిల్లాలో మరో కీలకమైన నియోజకవర్గం పులివెందుల. ఇక వైసిపి నుంచి జగన్మోహన్ రెడ్డి. కూటమి అభ్యర్థిగా రవీంద్రనాథ్  బరిలో ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో ఇక్కడ గెలుస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: