"నేనే రాజు నేనే మంత్రి" ఎవరితో అనుకున్నారు... ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో దగ్గుపాటి రానా ఒకరు. ఈయన లీడర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ కి ప్రేక్షకుల , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయలేక పోయింది. ఇక సోలో హీరో గా రానా కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. ఇకపోతే తేజ ఈ సినిమాను మొదట రాజశేఖర్ తో తీయాలి అనుకున్నారు. కానీ ఆ సినిమా సెట్ కాలేదు.

మరి రాజశేఖర్ తో అనుకున్న సినిమా రానా కు దగ్గరకి అందుకు వచ్చింది , ఆ మధ్యలో ఏమి జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం. దర్శకుడు తేజ "నేనే రాజు నేనే మంత్రి" మూవీ కథ ను ఒక లైన్ గా ప్రిపేర్ చేసుకొని రాజశేఖర్ కి వినిపించాడట. అది ఆయనకు చాలా బాగా నచ్చిందట. ఆ దానితో వెంటనే వీరు ఈ సినిమాలో హీరోయిన్ గా స్నేహ ను అనుకున్నారట. ఇక అహం అనే టైటిల్ తో ఈ మూవీ.ని స్టార్ట్ చేయాలి అని ఈ మూవీ మేకర్స్ అంతా ప్లాన్ చేసుకున్నారట. ఇక తేజ ఈ సినిమా కథ మొత్తం రెడీ అయిన తర్వాత రాజశేఖర్ కి వినిపించగా , ఆయనకు ఈ సినిమా క్లైమాక్స్ నచ్చలేదట.

దానితో ఆయన ఈ కథ క్లైమాక్స్ సన్నివేశాలలో కొన్ని మార్పులు , చేర్పులను సూచించగా , తేజ మాత్రం ఆ సినిమా క్లైమాక్స్ లో ఎలాంటి మార్పులు చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో రాజశేఖర్ తో అనుకున్న సినిమా ఆగిపోయింది. ఇక దానితో తేజ , రానా ను సంప్రదించడం , ఆ కథ మొత్తం వినిపించడం , ఆయనకు సూపర్ గా ఈ కథ నచ్చడంతో , వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. అలా రాజశేఖర్ , స్నేహ తో అహం అనే టైటిల్ తో అనుకున్న సినిమాను తేజ , రానా మరియు కాజల్ తో నేనే రాజు నేనే మంత్రి అనే టైటిల్ తో రూపొందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: