నోటి దూల..“నాదే తప్పు.. నన్ను క్షమించండి”..సెన్సేషనల్ వీడియో రిలీజ్ చేసిన శివాజీ..!
వీడియోలో శివాజీ ఏమన్నారంటే…
వీడియోలో శివాజీ మాట్లాడుతూ ఇలా అన్నారు..“హలో అండి… నిన్న సాయంత్రం ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటల గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఆ సమయంలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడాను. అయితే ఆ సందర్భంలో నేను రెండు అన్‌పార్లమెంటరీ పదాలు వాడాను. అది చాలా తప్పు. నేను మాట్లాడింది అందరు అమ్మాయిల గురించి కాదు. బయటికి వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ బాగుంటే మంచిదని చెప్పాలనే ఉద్దేశమే. కానీ ఆ రెండు పదాలు వాడకుండా ఉండాల్సింది. అది నా పెద్ద తప్పు.
స్త్రీ అంటే మహాశక్తి. నేను స్త్రీని అమ్మవారిలా భావిస్తాను. ఈ కాలంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఆ విషయం చెప్పాలనే ఉద్దేశంతో గ్రామీణ భాషలో మాట్లాడాను. కానీ ఆ భాష చాలా తప్పుగా మారింది. నా ఉద్దేశం మంచిదే కానీ, ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాకు ఎవరినీ అవమానించాలి, కించపరచాలి అనే ఉద్దేశం అసలు లేదు. ఇండస్ట్రీలోని మహిళల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే సాధారణ మహిళలు కూడా తప్పుగా భావిస్తే మీ అందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు.” అంటూ శివాజీ వీడియోలో భావోద్వేగంతో క్షమాపణలు కోరారు.
శివాజీ విడుదల చేసిన ఈ క్షమాపణ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది నెటిజన్లు ఆయన క్షమాపణను స్వీకరిస్తూ “తప్పు ఒప్పుకుని క్షమాపణ చెప్పడం గొప్ప విషయం” అంటూ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం “మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం” అంటూ ఇంకా విమర్శలు కొనసాగిస్తున్నారు. నోటి దూల అంతే కొన్నిసార్లు తప్పించుకోలేం అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఏదేమైనా, ఈ సంఘటన టాలీవుడ్లో మరోసారి మహిళల పట్ల వ్యాఖ్యలు ఎంత సున్నితమైన అంశమో గుర్తు చేసింది. బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు పదాల ఎంపిక ఎంత ముఖ్యమో ఈ వివాదం స్పష్టంగా తెలియజేస్తోంది.