చందు, పవిత్రల సంబంధాలపై నటుడు నరేష్ కామెంట్స్ వైరల్?

Suma Kallamadi
'దూరపు కొండలు నునుపు' అనే నానుడికి కళారంగం ఓ చక్కటి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి ఎంతో మంది యువతీ యువకులు తమ కలలను నెరవేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ అందులో సక్సెస్ అయిన వారిని మనం వేళ్ళలో లెక్కపెట్టొచ్చు. సినిమా కష్టాలు ఎలా ఉంటాయనేది స్వయంగా అనుభవించిన వారిని అడిగితేనే మనకి తెలుస్తుంది. ఇక్కడ సక్సెస్ రేటు తక్కువ గనుకనే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు అటువైపు వెళ్తామంటే పెద్దగా ఎంకరేజ్ చేయరు. అన్నింటికి మించి మొదట కళకోసం అక్కడికి వెళ్ళినవారు తరువాత కాలంలో అనేక ప్రలోభాలకు లొంగిపోతుంటారు.
దానికి తార్కాణంగా తాజాగా జరిగిన ఓ సంఘటనని చెప్పుకోవచ్చు. విషయంలోకి వెళితే, ప్రముఖ సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆ మరణాన్ని తట్టుకోలేని సహ నటుడు, ప్రేమికుడు నటుడు చందు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ఓ మీడియా వేదికగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు, నిత్య పెళ్లికొడుకుగా పేరుగాంచిన నరేష్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ యాంకర్ సదరు సీరియల్ నటీనటుల వ్యవహారం గురించి ప్రశ్న అడగగా నరేష్ తనదైన శైలిలో సమాధానం చెప్పుకొచ్చారు.
నరేష్ మాట్లాడుతూ... "ఇప్పటిలా కాదు, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి ఎవరికన్నా ఏదైనా అయితే, మిగతా వారంతా అండగా ఉండేవారు. ఈ తరం వారు ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అమ్మ విజయనిర్మల మరణించినప్పుడు నేను, నాన్న కృష్ణ ఎంతో కృంగిపోయాము. ఆ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలిచాం. లేదంటే చాలా కోల్పోయేవాడిని. ఒక వ్యక్తి బాధపడుతుంటే.. పది మంది మనకి ఉన్నారు అనే భావన అతనికి కలిగేలా చేయగలిగేవారు లేకపోతే ఇలాంటి ఘటనలే జరుగుతాయి. ఈ పరిస్థితి మారాలి." అంటూ నరేష్ అన్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం పవిత్ర మరణం తర్వాత.. చందు తనకిక ఎవరు లేరని ఒంటరిగా ఫీల్ అయ్యి ఉంటాడని, అదే అతని ఆత్మహత్యకు కారణమైందనే అభిప్రాయాన్ని నరేష్ వ్యక్తం చేయడంతో ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో నరేష్ మాటల్ని వ్యంగ్యంగా తీసుకొనేవారు కూడా లేకపోలేదు. పవిత్ర పేరు వినగానే మనోడికి తన పవిత్ర గుర్తుకు వచ్చి ఉంటుంది అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ కామెట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: