ఘనంగా బుల్లితెర నటి మహేశ్వరి కుమారుడి బారసాల ఫంక్షన్..!!

murali krishna
అమ్మ అనే పిలుపుకి నోచుకునేందుకు ప్రతి మహిళా కూడా ఎంతో తాపత్రయపడుతుంది. ఆమె ఎంత పెద్ద ఆస్తిపరురాలు అయినప్పటికీ తల్లి అనే మాట కోసం పడిగాపులు కాస్తుంది. ఇక ఈ కోవా కి సెలబ్రిటీలు కూడా చెందుతారు. వారు కూడా తెరపై ఎన్ని నాటకాలు వేసినప్పటికీ పర్సనల్ లైఫ్ లో మాత్రం తల్లిదండ్రులు అవ్వాలని తాపత్రయపడతారు. ప్రస్తుత కాలంలో అంటే పిల్లల్ని కంటే వారి అందం డామేజ్ అవుతుందని అద్దె గర్భం ద్వారా పిల్లలను కంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆ పిలుపుకి మరియు ఆ ఫీలింగ్ కి నోచుకోవడానికి తాపత్రయ పడుతున్నారు. అటువంటి వారిలో సీరియల్ నటి మహేశ్వరి కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గతంలోనే పండంటి బిడ్డకి జన్మనిచ్చి తల్లి అయ్యింది.గత ఏడాది ఈమె మరోసారి గర్భం దాల్చినట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నటి ఇంట సంతోషం వ్యక్తం అయింది. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ యూట్యూబ్లో వరుస వీడియోలు షేర్ చేసింది. డెలివరీ ముందు రోజు, డెలివరీ రోజు, ఆ తరువాత బాబును చూడడానికి వచ్చిన తారల సందడి ఇలా అన్నీ కూడా వీడియోల రూపంలో తన యూట్యూబ్లో షేర్ చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చింది. ఇక తాజాగా మహేశ్వరి ఇంట బాబు బారసాల ఫంక్షన్ జరిగినట్లు తెలుస్తుంది. తొలిసారి బాబును ఉయ్యాలలో వేశారు. ఈ ఫంక్షన్ లో మహేశ్వరి దంపతులు ఇద్దరూ పసుపు రంగు దుస్తులలో మెరిశారు.
ఇక బాబు ఉయ్యాల ఫంక్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబుకు ఏం పేరు పెట్టారనేది మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక మహేశ్వరి కెరీర్ విషయానికి వస్తే.. మహేశ్వరి కి నెగిటివ్ రోల్స్ బాగా సెట్ అవుతాయి. ఈ ముద్దుగుమ్మ గతంలో వదినమ్మ, శశిరేఖా పరిణయం సహా ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక ఈ బ్యూటీ కేవలం సీరియల్స్ కే పరిమితం కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పాలు రియాలిటీ కార్యక్రమాలలోనూ పాల్గొని. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడి 2 ఇలా ఎన్నో రకాల షోస్ లో పాల్గొని సందడి చేసింది.ఇక ఇటీవల నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి తప్పుకుంది మహేశ్వరి. తాను ప్రెగ్నెంట్ కావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ సీరియల్ లో మహేశ్వరి యాక్టర్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించే ఈ ముద్దుగుమ్మ కి స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ ఏర్పడింది. ప్రస్తుతం మహేశ్వరి ఏ చిన్న పని చేసిన కూడా అది సోషల్ మీడియాలో రచ్చగా మారుతుంది. ఇదే క్రమంలో వీరి బాబు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మహేశ్వరి మొదటి బిడ్డ పేరు హరిణి. ఈమె కూడా తన తల్లితో కలిసి యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: