ప్రకాశం : జిల్లాలో ఊహకందని ఫలితాలు.. ఆ సర్వే చెప్పిందే జరుగుతుందా..?

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో నేటితో ప్రచారం ముగిసింది .ఇన్ని రోజులు రాజకీయ ప్రచారంతో ఊదరగొట్టిన మైకులు నేటి సాయంత్రం 6 గంటల నుంచి మూగబోనున్నాయి.ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు మండుటెండను,జోరు వానను సైతం లెక్కజేయకుండా జోరుగా ప్రచారం చేసాయి.ఇక పోలింగ్ కు ఒకరోజు మాత్రమే సమయం వుంది .ఇప్పటినుంచి రాజాకీయ పార్టీలు డబ్బు పంపిణీపై దృష్టి పెడుతున్నారు.ఓటుకు 3000 నుంచి 5000 వరకు ఈ సారి ఇస్తున్నట్లు సమాచారం.అయితే ఈ ఎలక్షన్ పరంగా ప్రజల మనుసులో ఏముందో కచ్చితంగా చెప్పలేము .పోలింగ్ బూత్ కి వెళ్లి ఓటు వేసే సమయానికి ఓటరు మనసు మారిపోతుంది.దీనితో రాజకీయ పార్టీలు ప్రచారం ముగిసిన కూడా ప్రజలకు బహుమతుల రూపంలో సీక్రెట్ ప్రచారం చేస్తూ వుంటారు.అయితే ఎన్ని చేసిన ఓటు వేసే వ్యక్తికి ఆ సమయంలో ఎవరికీ ఓటు వేయాలనిపిస్తే వారికీ వోట్ వేయడం జరుగుతుంది.ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తికరంగా మారింది .ఇందులో ఉమ్మడి  ప్రకాశం జిల్లాలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.ఎన్నికల ప్రచారం ముగియడంతో జిల్లా ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో తాజాగా కేకే సర్వే తన చివరి మాట తెలిపింది..

ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గెలవనున్నట్లు సర్వే తెలిపింది.అలాగే అద్దంకి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ మరోసారి విజయ దుందుభి మోగించనున్నట్లు సర్వే తేల్చింది.ఇక చీరాల నియోజకవర్గంలో మాత్రం టీడీపీ,వైసీపీ మధ్య తీవ్ర పోటీ ఉండనున్నట్లు సమాచారం.సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా వైసీపీ,టీడీపీ మధ్య తీవ్ర పోటీ ఉండనున్నట్లు తెలుస్తుంది.అలాగే  ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తాడిపత్రి చంద్రశేఖర్ విజయం సాదించనున్నారు.దర్శి నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ విజయం సాదించనున్నారు.ఒంగోలు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి దామంచర్ల జనార్దన్ విజయం సాదించనున్నారు.కొండపి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి డోలా శ్రీబాల గెల్వనున్నట్లు సమాచారం .మార్కాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి విజయం సాదించనున్నారు.గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కుండూరు నాగార్జున రెడ్డి గారు విజయం సాదించనున్నారు.కనిగిరి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి  ముగ్గు ఉగ్ర నరసింహారెడ్డి విజయం సాదించనున్నారు.కందుకూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు విజయం సాదించనున్నారు.ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాలలో కూటమి 7 నియోజకవర్గాలలో విజయం సాదించనున్నట్లు ,వైసీపీ 3 నియోజకవర్గాలలో విజయం సాదించనున్నట్లు ,అలాగే 2 చోట్ల ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండనున్నట్లు కేకే సర్వే తేల్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: