"ఇండియన్ 2" విడుదలకు ముందు అలాంటి ప్లాన్ చేస్తున్నారా..?

MADDIBOINA AJAY KUMAR
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తాజాగా "ఇండియన్ 2" అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు లో "భారతీయుడు 2" అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో కనిపించనుండగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చాలా రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. కానీ మధ్యలో కొన్ని అనువార్య సంఘటనలు ఎదురు కావడంతో ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆగిపోయింది.

మళ్ళీ తిరిగి ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించి కొన్ని రోజుల క్రితమే పూర్తి చేశారు. ఇకపోతే జూన్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్రచారాలను కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అందులో భాగంగా "ఇండియన్ 2" మూవీ బృందం ఓ కొత్త ప్లాన్ ను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ మూవీ అద్భుతమైన విజయం అందుకున్న అందరికీ తెలిసిందే .

ఈ మూవీ తో కమల్ , శంకర్ ఇద్దరి క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇదిలా ఉంటే "ఇండియన్ 2" విడుదలకు ముందు ఇండియన్ సినిమాను రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అని ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ల ట్రెండ్ జోరుగానే కొనసాగుతుంది. అందులో భాగంగా ఇండియన్ మూవీ ను రీ రిలీజ్ చేసినట్లు అయితే "ఇండియన్ 2" కు కూడా హెల్ప్ అవుతుందేమో అనే ఉద్దేశంతో ఈ సినిమాను రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: