ఓటు వేస్తే పెట్రోల్ ఫ్రీ.. ఎక్కడంటే?

praveen
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా కూడా ఓటర్ల పండుగ కొనసాగుతూ ఉంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని చోట్ల వివిధ తేదీలలో ఎన్నికలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని రాష్ట్రాలలో మే 13వ తేదీన ఓటింగ్ జరగబోతుంది. ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ప్రచారం నిర్వహించిన అభ్యర్థుల్లో ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంపై ఒక క్లారిటీ కి వచ్చారు ఓటర్లు.

 ఇక తమ ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కొంతమంది ఓటు ఏం వేస్తాం లే అనుకొని ఇక సైలెంట్ గానే ఉండాలి అనుకుంటున్నారు. అయితే ఇలాంటివారిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు ఎన్నికల అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే కొంతమంది స్వచ్ఛందంగా కూడా ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తూ ఉండడం గమనార్హం. ఏకంగా ఓటు వేసిన వారికి ఐస్ క్రీమ్ ఫ్రీ అంటూ ఇటీవలే ఒక దుకాణపు యజమాని పెట్టిన ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 అయితే ఏపీలో మే 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో  కొన్ని కంపెనీలు ఎన్నికల హడావిడిని బాగా వినియోగించుకుంటున్నాయ్. ఎన్నికల్లో ఓటు వేసిన వారికి పలుచోట్ల కంపెనీలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయ్. ఇక ఏపీలోని ఒక బైక్ షోరూం అలాంటి ప్రకటనే చేసింది. ఓటేసిన వారు తమ చేతికి ఉన్న సిరా చుక్క చూపిస్తే ఫ్రీ ఆయిల్ లేదా పెట్రోల్ టాప్ అప్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఎంత ఇస్తారు అనేది మాత్రం వెల్లడించలేదు. ఏపీలో ఆరు చోట్ల ఈనెల 15 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఈ సదరు కంపెనీ ఇటీవల ప్రకటించింది. ఇలా కొంతమంది ఓట్ పై అవగాహన పెంచేందుకు ఇలాంటి ఆఫర్ ప్రకటిస్తుంటే.. ఇంకొంతమంది ఇలాంటి ఆఫర్ల ద్వారా తమ రెస్టారెంట్ పాపులారిటీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: