మా కెప్టెన్ మంచోడు.. హార్దిక్ కెప్టెన్సీ పై ముంబై ఫేసర్ కామెంట్స్ వైరల్?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా అటు ముంబై ఇండియన్స్ సారధిగా దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా గురించి చర్చించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. జట్టుకు ఐదు సార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మను సారధ్య బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాని మార్చినప్పుడే జట్టు యాజమాన్యం నిర్ణయాన్ని అందరూ తప్పుపట్టారు. ఇక ఇప్పుడు జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాడు అనుకున్న హార్దిక్  అటు కెప్టెన్ గా విఫలం కావడంతో ఇక మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడంతో ఇక జట్టులో కొన్ని వివాదాలు నెలకొన్నాయని ఇలాంటి వివాదాలు కారణంగానే అటు ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటమిలను చవిచూస్తుంది అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక ఈ ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములతో పాయింట్స్ పట్టికలో అట్టడుగున కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ జట్టు ఇక ఇప్పటికే టోర్ని నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే.

 ఇలా అందరూ కూడా అటు హార్దిక్ పాండ్యా పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యం లో.. అటు ముంబై ఇండియన్స్ ఫేసర్ గెరాల్డ్ కోఎడ్జి మాత్రం ఇక హార్దిక్ కెప్టెన్సీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ కెప్టెన్సీ చాలా బాగుంది ఇప్పటివరకు విభిన్నమైన సారధ్య శైలిని చూసి ఉంటాం. ఇతడు మాత్రం కొత్త స్టైల్ తో తనకంటూ గుర్తింపు పొందాడు. అందరి కెప్టెన్సీ ఒకేలా ఉండదు. వ్యక్తిని బట్టి కెప్టెన్సీ మారుతూ ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తిని నింపడంలో హార్దిక్ ముందుంటాడు. మ్యాచ్ ప్రణాళిక విషయాల్లో పూర్తి స్పష్టతతో ఉంటాడు. పాండ్యా సారథ్యం ఎవరికి తీసిపోదు అంటూ గేరాల్డ్ కోఎడ్జి చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: