కేసీఆర్ కు బిగ్ షాక్.. పోలింగ్ కు ముందే కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

praveen
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన బిఆర్ఎస్ పార్టీ ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారాన్ని దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలి అని భావించిన ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదాని మాత్రమే కట్టబెట్టారు. అయితే ఇలా గులాబీ పార్టీ ప్రతిపక్ష హోదాలోకి వచ్చిందో లేదో చివరికి ఆ పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 ఒకప్పుడు ఎలాగైతే కెసిఆర్ ఏకంగా కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలు అందరినీ కూడా గులాబీ పార్టీలో చేర్చుకున్నారో.. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే చేస్తుంది. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలందరూ కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో కూడా మరిన్ని ఫిరాయింపులు ఉండే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇలా ఎంతో మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని అందరూ అనుకుంటూ ఉండగా పోలింగ్ కి ముందే అటు గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.

 ఏకంగా కేసీఆర్ నూ మానసికంగా దెబ్బ కొట్టడమే లక్ష్యంగా రేవంత్ వ్యూహాలను పన్నుతున్నాడు అన్నది అర్థమవుతుంది. దీంతో పోలింగ్ కు ముందే బిఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని హస్తం పార్టీ అనుకుంటుందట. ఈ క్రమంలోనే తమతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే దీని గురించి హై కమాండ్ కు సమాచారం చేరవేసారని... అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పడం ఖాయమని ఒక టాక్ నడుస్తుంది. అయితే పోలింగ్కి ముందు ఇలా గులాబీ పార్టీ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే లాభమా నష్టం అనే విషయంపై ఇక హస్తం పార్టీ అధిష్టానం అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక రాష్ట్ర నేతలతో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనే విషయం గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Tg

సంబంధిత వార్తలు: