బీటలు వారిన వైసీపీ కంచుకోట.. జగన్‌ను రాయలసీమ పట్టించుకోలేదా?

Suma Kallamadi
వైసీపీకి ప్రస్తుత ఎన్నికల్లో అనూహ్య పరాభవం ఎదురైంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 151 స్థానాల్లో గెలవగా ప్రస్తుత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయింది. ఈ తరుణంలో వైసీపీకి కంచుకోట లాంటి రాయలసీమలో బీటలు వారింది. ముఖ్యంగా కూటమి స్పీడ్‌కు బ్రేకులు వేయలేకపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ జోరులో కొట్టుకపోయింది. ముఖ్యంగా రాయలసీమ మొదటి నుంచి వైసీపీ బలమైన మద్దతుదారుగా నిలుస్తుంది. అయితే తాజాగా ఎన్నికల్లో వైసీపీ రాయలసీమలో తీవ్రంగా నష్టపోయింది. కూటమి జోరులో వైసీపీ చతికిల పడింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మొత్తం 11 సీట్లలో 7 రాయలసీమ నుంచే వచ్చాయి. అదొక్కటే కొంచెం ఊరట నిచ్చే అంశం. ముఖ్యంగా రాష్ట్రంలోని 8 ఉమ్మడి జిల్లాలో వైసీపీ ఖాతా తెరవలేదు. కేవలం సున్నాకే ఆ పార్టీ పరిమితమైంది. దీంతో రాయలసీమ జగన్‌ను వదిలేసిందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
2019లో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడంలో సరికొత్త ఒరవడి సృష్టించారు. దీంతో పాటే ఆయన చేసిన కొన్ని తప్పులు పార్టీని నట్టేట ముంచాయి. అందులో పగ, ప్రతీకారాలతో కూడిన రాజకీయాలు జరిగించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన  పాదయాత్ర తర్వాత పసుపు నీళ్లు చల్లారనే కోపంతో అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. అంతేకాకుండా ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసుకున్నారు. గొట్టిపాటి రవి, అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి రాజులను టార్గెట్ చేశారు. తన మాట వినట్లేదనే కోపంతో రఘురామకృష్ణం రాజును అరెస్ట్ చేయించి కొట్టించారు. చివరికి చంద్రబాబును సైతం జైలుకు పంపించారు. సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయనే ధీమాతో ఎన్నికల్లోకి దిగారు. చివరికి కౌంటింగ్ మొదలైన మొదటి రౌండ్ నుంచి వైసీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఎక్కడా ఆ పార్టీకి ఉపశమనం దక్కలేదు. ఒక్కొక్కటిగా మొత్తం ఎమ్మెల్యే స్థానాలు కోల్పోయారు. చివరికి 11 స్థానాలు మాత్రమే మిగిలాయి. వై నాట్ 175 అనే నినాదం మూగబోయింది. రాయలసీమలో తనకు బలంగా సపోర్ట్ చేసిన రెడ్డి సామాజిక వర్గం కూడా ఈ సారి వైసీపీని వీడి టీడీపీకి జై కొట్టినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, చాలా మందికి టికెట్లు నిరాకరించడం వైసీపీ ఓటమికి బలమైన కారణాలయ్యాయి. ముఖ్యంగా సీమలోని 52 స్థానాల్లో గతంలో 3 సీట్లు మాత్రమే టీడీపీకి ఇచ్చి మిగిలిన సీట్లన్నీ టీడీపీకి దక్కేలా చేసింది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి తిరగబడింది. 45 స్థానాలు టీడీపీ కూటమికి దక్కాయి. మరోసారి తన ప్రాభవాన్ని రాయలసీమలో జగన్ నిలబెట్టుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: