కాజల్ : కెరీర్ మొత్తాన్ని మార్చేసింది ఆ మూవీనే.. ఒక్క దెబ్బతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ద్వారా కాజల్ అగర్వాల్ కు భారీ స్థాయికి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చందమామ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమాలోని నటన ద్వారా కాజల్ కి మంచి గుర్తింపు లభించింది. ఇలా కెరియర్ను మంచి స్థితిలో ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఇక ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో కాజల్ తన అద్భుతమైన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఈ మూవీ ద్వారా వచ్చింది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తన అద్భుతమైన నటన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే డాన్స్ , నటన ఇలా అనేక అంశాలతో ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో కాజల్ స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత ఈమె ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇప్పటికి కూడా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: