రమ్యకృష్ణ కెరీర్ లో శివగామిని మించిన పాత్ర నీలాంబరి.. ఆ సీన్ నెక్స్ట్ లెవెల్!

Reddy P Rajasekhar
ప్రముఖ టాలీవుడ్ నటి రమ్యకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడం ద్వారా కెరీర్ పరంగా సత్తా చాటారు. కెరీర్ తొలినాళ్లలో రమ్యకృష్ణ కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించినా వరుస ఫ్లాపులు ఆమె కెరీర్ కు ఒకింత శాపంగా మారాయి. అయితే ఆ తర్వాత హీరోయిన్ గా సక్సెస్ సాధించిన రమ్యకృష్ణ నరసింహ సినిమాలో నీలాంబరి రోల్ లో నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు.
 
రమ్యకృష్ణ కాకుండా ఆ పాత్రలో ఎవరు నటించినా సినిమా మరీ భారీ స్థాయిలో సక్సెస్ అయితే సాధించేది కాదని చెప్పవచ్చు. సౌందర్య సాఫ్ట్ రోల్ లో నటించగా రమ్యకృష్ణ ఈ సినిమాలో వయస్సుకు మించిన పాత్రను పోషించి తన అద్భుతమైన నటనతో సత్తా చాటారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో రజనీకాంత్ ను ఫేస్ చేసే సన్నివేశాల్లో రమ్యకృష్ణ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
రమ్యకృష్ణ సినీ కెరీర్ లో నరసింహ తర్వాత ఆ స్థాయిలో మంచి పేరును తెచ్చిపెట్టిన సినిమా బాహుబలి మాత్రమేనని చెప్పాలి. బాహుబలి సినిమాలో శివగామి పాత్ర సైతం రమ్యకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. రమ్యకృష్ణ ప్రస్తుతం రోజుకు 10 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. రమ్యకృష్ణ తన రేంజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
 
రమ్యకృష్ణకు బాహుబలి సిరీస్ తర్వాత మాత్రం ఆ స్థాయి సక్సెస్ దక్కలేదనే చెప్పాలి. వయస్సు పెరుగుతున్నా రమ్యకృష్ణ ఇప్పటికీ తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రమ్యకృష్ణను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రాబోయే రోజుల్లో రమ్యకృష్ణ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. ప్రముఖ నటి
 రమ్యకృష్ణ కథ నచ్చితే మాత్రమే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: