జబర్దస్త్ కి పూర్వ వైభవం.. రోజా మళ్లీ వస్తుందా..!?

Anilkumar
బుల్లితెరపై చెరగని ముద్ర వేసుకున్న జబర్దస్త్ షో 2013లో ప్రారంభమై ఇప్పటికి అదే వైభవంతో కొనసాగుతూ ఉంది. ఇక ఇందులో మొదట యాంకర్ గా అనసూయ చేసింది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే రష్మీ చేస్తుంది. జడ్జ్లుగా రోజా నాగబాబు వ్యవహరించారు. ఇందులో భాగంగానే జబర్దస్త్ కి చాలామంది కమెడియన్స్ గా  ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ షో అంటే నచ్చని వారు ఎవరు ఉండరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాత్రి 9 అయ్యింది అంటే చాలు చూసేందుకు టీవీ లకి అతుక్కు పోతూ

 ఉంటారు జనాలు. సుధీర్ హైపర్ ఆది గెటప్ శ్రీను చమ్మక్ చంద్ర వంటి టాప్ కమెడియన్స్ వచ్చిన తర్వాత జబర్దస్త్ షో మరింత పాపులర్ అయ్యింది అని చెప్పొచ్చు. అంతేకాదు వీళ్ళ ద్వారానే జబర్దస్త్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే జబర్దస్త్ ఎందరికో జీవితాన్ని ఇచ్చింది. వారిలో రష్మి గౌతమ్ అనసూయ కూడా ఒకరు. మొదట సామాన్యులు గానే వీళ్ళు జబర్దస్త్ కి వచ్చారు. ఇప్పుడు బుల్లితెరపై టాప్ యాంకర్లుగా కొనసాగుతున్నారు. అలాగే రోజా కి కూడా జబర్దస్త్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది

 అని చెప్పొచ్చు. జబర్దస్త్ కమెడియన్స్ కి ఎల్లప్పుడూ అండగా ఉంటూ వాళ్లకి సహాయం చేస్తూ వాళ్ళలో ఒకరిగా కలిసిపోతూ ఉంటుంది రోజా. ఎప్పుడూ వారిపై కౌంటర్లు వేస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటుంది. అంతేకాదు జబర్దస్త్ ఈ స్థాయిలో సక్సెస్ అయ్యింది అంటే అంతో ఇంతో రోజా పాత్ర కూడా ఉంది అని చెప్పాలి. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా రోజా కొన్నాళ్లు జడ్జిగా వ్యవహరించింది. ఆ తర్వాత తనకి మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. అయితే తాజాగా ఇప్పుడు 2024 ఎన్నికల్లో రోజా ఓడిపోవడంతో మళ్లీ జబర్దస్త్ కి ఎంట్రీ ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కి రోజా తిరిగి జడ్జ్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: