తెలంగాణ ఫ్యూచర్ బిజీపీనే.. కానీ మోడీ లేకుంటే పరిస్థితేంటో?
ప్రయత్నాలు చేయడమే కాదు అంతకంతకు పట్టు సాధిస్తూ ముందుకు సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 8 అసెంబ్లీ స్థానాల విజయం సాధించింది అయితే ఇది చెప్పుకోవడానికి తక్కువే అయినా.. గతంతో పోల్చి చూస్తే ఎక్కువ స్థానాలే సాధించింది. ఇక మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఏకంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 స్థానాల్లో విజయ డంక మోగించింది. ఇలా క్రమక్రమంగా తెలంగాణలో బిజెపి పట్టు పెరుగుతుంది అన్నది అర్థమవుతుంది. అయితే తెలంగాణ సాధించింది అన్న పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బిఆర్ఎస్ పతనమయ్యే పరిస్థితి ఉంది అన్నది ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి.
ఇక కాంగ్రెస్ కూడా వన్ టైం వండర్ అన్న విధంగానే ఊహించని విధంగా అధికారంలోకి వచ్చిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారట. దీన్ని బట్టి చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక బిజెపిని తెలంగాణ ఫ్యూచర్ గా మారుతుందని అధికారంలోకి వచ్చే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బిజెపి అంతకంతకు పట్టు సాధిస్తున్న తీరు చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మోడీ మేనియా వల్లే తెలంగాణలోబిజెపికి ఆదరణ లభిస్తుంది. కానీ ఒకవేళ మోడీ ప్రధానిగా లేకపోతే.. తెలంగాణ రాజకీయాల్లో బిజెపి పరిస్థితి ఏంటి అన్నది కూడా అందరిలో నెలకొన్న ప్రశ్న. ఏం జరగబోతుందో చూడాలి.