పవన్‌ కళ్యాణ్‌ జీతం కట్‌ చేస్తున్న జగన్‌ ?

Veldandi Saikiran
జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి కారణంగా ఇప్పుడు జీతం కూడా తీసుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్న కానీ ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవన్నారు.
అందుకే నా జీతం కూడా వదిలివేసానని వెల్లడించారు పవన్‌ కళ్యాణ్‌. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి  పిఠాపురానికి వచ్చానని... గెలిచిన వెంటనే పనిలోకి దిగానని పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకుని ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేశానని వివరించారు. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ రావని ప్రచారం చేస్తే గుర్తింపు చేసి అందజేస్తున్నామని స్పష్టం చేశారు.

వైసీపీ లాగా సంక్షేమం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో  ప్యాలెస్  నిర్మాణానికే ప్రాధాన్యత ఇచ్చారు... రిషికొండలో ఇల్లు కట్టుకోవడాన్ని తప్పు పడుతున్నట్లు ఫైర్‌ అయ్యారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇంటింటికీ. పంపిణీ చేయడం అశాంభవం అన్నారని గుర్తు చేశారు పవన్‌.  ఇది నిజం కాదని.... ఈవేళ ప్రభుత్వ సిబ్బందితో పంపిణీ చేసి రుజువు చేశామని వెల్లడించారు. ప్రభుత్వ వ్యవస్థలు అన్ని నిర్విర్యం అయ్యాయని... ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు.  నా 5 ఏళ్ల పాలనలో రక్షిత మంచినీటి పథకం లేని గ్రామం ఉండకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు.  

గిరిజన మారుమూల ప్రాంతాల్లో అనారోగ్యం బారినపడిన వారిని డోలుపై మోసుకుని రాకుండా సౌకర్యాలు కల్పించాలని ఉందని... పిఠాపురంలో సొంత ఇల్లు నిర్మించుకుంటానని ప్రకటించారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలం కోసం వెతుకుతున్నానని స్ఫష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లబ్ధిదారులకు అందజేస్తున్నా. సంక్షేమ పథకాలను రీ సర్వే చేపడతామని కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: