బాహుబలి 2, RRR రికార్డులని మడతపెట్టేస్తున్న కల్కి?

Purushottham Vinay
తెలుగు సినిమాని మరోసారి ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్ళింది కల్కి 2898 ఏడీ. ఇప్పటికే మన ఇండస్ట్రీ నుంచి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించి మన సినిమా ఖ్యాతిని పెంచగా..ఇప్పుడు 'కల్కి 2898 AD' లాంటి విజువల్ వండర్ రావడంతో అందరూ మరోసారి తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్కే ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టేసింది. ఇంకా రాబడుతుంది కూడా. ఇప్పటిదాకా కల్కి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏకంగా రూ. 500 కోట్లను దాటేశాయి. కల్కి చిత్ర కథను, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రీకరించిన తీరును దేశం మొత్తం కూడా ఎంతగానో పొగుడుతుంది. రాజమౌళి, శంకర్ స్థాయి దర్శకుడిగా నాగ్ అశ్విన్ కల్కితో పేరు తెచ్చుకున్నాడు.భవిష్యత్తులో జరగబోయే ఒక ఊహాజనిత కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. 


ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. ఇండియా కంటే కూడా విదేశాల్లో కల్కి 2898 AD సినిమా విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. యూఎస్ లో కల్కి సినిమా వసూళ్లు ఏకంగా $11 మిలియన్ వసూళ్లకు చేరుకున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. దాదాపు రూ. 92 కోట్లు. ఇంకొక 8 కోట్లు వస్తే 100 కోట్లు వచ్చినట్టే. కల్కితో ప్రభాస్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. కెనడా దేశంలో కల్కి2898 ఏడి సినిమా హైయెస్ట్ తెలుగు గ్రాసింగ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ రికార్డులు మడత పెట్టేసింది. ఇంకా ఎక్కువ వసూళ్లు రాబడుతుంది కూడా.మన తెలుగు సినిమాలకు ఆదరణ లభించే ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ ఇంకా జర్మనీలో కూడా కల్కి 2898 ఏడి చిత్రానికి విశేష ఆదరణ లభిస్తుంది. హిందీలో కూడా ఇప్పటికీ కల్కి సినిమా వసూళ్లు రూ. 100 కోట్ల నెట్ ని దాటేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: