వైసీపీని మొత్తం మార్చేస్తోన్న జ‌గ‌న్‌... వాళ్ల ప‌దవులు పీకేస్తున్నారా..?

RAMAKRISHNA S.S.
ప్ర‌క్షాళ‌న త‌ప్పదు!  అయితే.. అది ఎప్పుడు? అనేది మాత్రం ప్ర‌శ్న‌గానే మారింది. ఘోర ప‌రాజ‌యం త‌ర్వా త‌.. వైసీపీ ఇప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. నిజానికి 2019లోనూ టీడీపీ ప‌రాజ‌యం త‌ర్వాత‌.. ఆ త‌ప్పును ఎవ‌రివైపు చూపించాల‌నేది పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అలానే.. ఇప్పుడు కూడా.. వైసీపీ ఓట‌మి కి బాధ్య‌త ఎవ‌రిది? అనే విష‌యంలో అధిష్టానం పున‌రాలోచ‌న‌లో ప‌డిపోయింది. తొలుత సీనియ‌ర్ ఐఏఎస్ అదికారి ధ‌నుంజ‌య‌రెడ్డిదే త‌ప్పంటూ.. కొంద‌రు మాట్లాడారు.

త‌ర్వాత‌.. వ‌లంటీర్ల దే త‌ప్ప‌ని అన్నారు. ఆ త‌ర్వాత‌.. నేరుగా నెమ్మ‌ది నెమ్మ‌దిగా.. త‌ప్పు త‌మ నాయ‌కుల దేన‌ని కాసు మ‌హేష్‌రెడ్డి వంటివారు నోరు విప్ప‌డం ప్రారంభించారు. అయితే.. అస‌లు వేళ్ల‌న్నీ.. అధినేత జ‌గ‌న్‌వైపే చూపిస్తున్నాయి. అలాగ‌ని నోరు విప్పితే.. పార్టీ ప‌రువు పోతుంద‌ని నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యం లోనే కొన్నాళ్లు ఈ రూమ‌ర్ల‌కు విరామం ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన జ‌గ‌న్‌.. రాష్ట్రం నుంచి వెళ్లి.. బెంగ‌ళూరులో ఉంటున్నారు. అయితే.. ఇప్పుడు పార్టీ ప్ర‌క్షాళ‌న‌పై ఆయ‌న దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది.

జిల్లా క‌మిటీల నుంచి మండ‌ల క‌మిటీల వ‌ర‌కు మార్పు దిశ‌గా జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఉండ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో నాయ‌కుల ప‌నితీరును ఆయ‌న స‌మీక్షించి.. కీల‌క నేత‌ల‌ను పక్క‌కు త‌ప్పించి.. మ‌రింత దూకుడుగా ఉండేవారికి ప‌ద‌వులు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే.. ఇప్ప‌టికిప్పుడు ఇలా చేయ‌డం కూడా స‌రికాద‌నే అభిప్రాయంఉంది. తీసేసే నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌స్తే.. అది పెద్ద దుమారం రేపే చాన్స్ ఉంటుంద‌ని.. అప్పుడు నేరుగా అధినేత‌పైనే విమ‌ర్శ‌లు వ‌చ్చే ఛాన్స్ ఉంటుంద‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. దీనిని కొంత వాయిదా వేసుకునే దిశ‌గానే ఆలోచ‌న సాగుతోంది. ముందు విరామం ఇద్దాం.. ప‌రిస్థితులు కూల్ అయ్యాక అప్పుడు నిర్ణ‌యం తీసుకుం టే.. వేడి త‌గ్గి నాయ‌కులుకూడా ఆలోచ‌న‌లో ప‌డ‌తార‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఇప్ప‌టికిప్పుడు.. ప‌రిస్థితి కుదుట‌ప‌డ‌క‌పోయినా..మ‌రో రెండు మూడు మాసాలైన త‌ర్వాత అయినా.. మార్పు దిశ‌గాప్ర‌క్షాళ‌న దిశ‌గా అడుగులు ప‌డ‌తాయ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: