ఆ ఫ్రాంచైజీ.. ఇంకా నాకివ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు : శ్రీశాంత్
ఇక ఇలాంటి చెల్లింపుల విషయంలో ఆటగాళ్ల నుంచి ఎక్కడ అసంతృప్తి ఉండకుండా. జాగ్రత్త పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక ప్లేయర్ కి మాత్రం ఓ జట్టు యాజమాన్యం ఇవ్వాల్సిన మొత్తం ఇంకా ఇవ్వలేదట. 2011లో ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇప్పటికి ఇవ్వలేదు అంటూ ఇటీవలే టీమిండియా మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఇలాంటి సంచలనం వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు టీం ఇండియా మాజీ ప్లేయర్ శ్రీశాంత్. 2011 ఐపిఎల్ సీజన్లో టోర్నీలో చేరిన కొచ్చి టస్కర్స్ కేరళ జట్టు తరఫున శ్రీశాంత్ ఆడాడు.
అయితే ఈ జట్టు కేవలం ఒకే ఒక సీజన్లో మాత్రమే ఐపీఎల్లో భాగం అయింది. ఆ తర్వాత ఏడాదికే రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టు తరఫున ఆడిన టీమిండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ ఆ ఫ్రాంచైజీ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనతో పాటు శ్రీలంక ఆటగాళ్లు ముత్తయ్య మురళీధరన్, మహేళ జయవర్దనే తో లాంటి వారికి కూడా ఆ జట్టు యాజమాన్యం బాకీ ఉంది అంటూ శ్రీకాంత్ ఆరోపించాడు. ఇక ఆ మొత్తం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. దీనిపై బిసిసిఐ జోక్యం చేసుకొని ఏడాదికి 18 శాతం వడ్డీ చొప్పున పూర్తిగా తిరిగి చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరాడు శ్రీశాంత్.