ఏపీ ఎలక్షన్స్: చివరి క్షణంలో నోరు జారిన పార్టీ అధినేతలు..!

Divya

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం తో తెరపడిపోయింది.. అయితే నిన్నటి రోజున చివరి నిమిషం వరకు అటు వైసిపి , కూటమి పార్టీలు సైతం పలు రకాల ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా నాయకులు కూడా తమ ప్రసంగాలతో ప్రచారాలు ముగించేశారు. ఇప్పటివరకు చాలామంది నేతలు అనేక విమర్శలు చేసుకున్నప్పటికీ వ్యక్తిగతం నుంచి అధికారం వరకు అన్ని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఓటింగ్ కి కేవలం ఈరోజు ఒక్కటే మిగిలి ఉన్నది.. రేపటి రోజు నుంచి ఓటుని వినియోగించుకోవచ్చు ప్రజలు.

ముఖ్యంగా ఇప్పుడు మూడు పార్టీల నాయకులు చివరి రోజు చివరి క్షణంలో చేసినటువంటి ప్రచారంలో నోరు జారిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీఎం జగన్ చివరిసారిగా పిఠాపురం సభలో మాట్లాడారు.. ఈ సందర్భంగా పవన్ పైన ఇప్పటివరకు చేస్తున్న విమర్శలకు మరింత కూడా యాడ్ చేసి దుమ్ము దులిపారు.. ముఖ్యంగా వివాహాల విషయాన్ని చివరి నిమిషంలో కూడా కలిపారు.. నాలుగో పెళ్లికి కూడా త్వరలోనే సిద్ధమే అంటూ కూడా తెలియజేస్తూ ఇక్కడ గెలిస్తే హైదరాబాద్ కు వెళ్ళిపోతాడు అని విమర్శలను కూడా చేశారు. ఈ విషయాలు అటు జనసేనాని ఆగ్రహానికి గురయ్యేలా చేస్తున్నాయి.

చంద్రబాబు చివరి నాలుగో సభ కర్నూలు జిల్లా నంద్యాలలో మాట్లాడడం జరిగింది.. ఇప్పటివరకు చేయని భారీ కామెంట్స్ చేశారు చంద్రబాబు.. మొత్తం మీద కాస్త వ్యతిరేకత వచ్చేలా కనిపిస్తోంది.. మళ్లీ గెలిస్తే విశాఖ నుంచి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తాడంట జగన్.. అంటూ చాలా వ్యంగాస్త్రాలు చేసినప్పటికీ అక్కడితో ఆగకుండా విశాఖలో కాదు పోయి నీ తండ్రి సమాధి వద్ద చేసుకో ప్రమాణం అంటూ చేసిన వ్యాఖ్యలు అటు టిడిపి వారిని వైసిపి అభిమానులను కాస్త ఆవేదనకు గురయ్యేలా చేస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ కూడా చిట్ట చివరి సభలో పాత విమర్శలు చేసినా.. తనకు డబ్బులు లేక రాజకీయాలలోకి రాలేదని తెలిపారు.. కేవలం ప్రజల కోసమే వచ్చానని తెలిపారు. అయితే జగన్ ను ఓడించాలని పదేపదే చెప్పినప్పటికీ.. అభిమానులు రెండుసార్లు రెస్పాన్స్ బాగానే ఇచ్చినా.. మూడవసారి పెద్దగా పట్టించుకోలేదు..  దీంతో ఈ ముగ్గురి నాయకులలో కాస్త అసహనం కూడా కనిపిస్తోంది. మరి జనం ఎవరికి తీర్పు ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: