టీడీపీపై ఆశగా ఉన్న ఇండియా కూటమి?

Purushottham Vinay
కేంద్రంలో పది సంవత్సరాల తర్వాతైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ.. ఈక్రమంలో కొంత తాను తగ్గి అయినా కూడా కూటమిని ఏర్పాటు చేసుకుంది.చాలా పార్టీలతో కలిసి.. ఇండియా కూటమిగా కాంగ్రెస్ ఏర్పడింది. దీనిలో ఢిల్లీ అధికార పార్టీ ఆప్‌, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌, తమిళనాడు అధికార పార్టీ.. డీఎంకే, యూపీకి చెందిన ఎస్పీ ఇంకా అలాగే బిహార్‌కు చెందిన ఆర్జేడీ పార్టీలు ఉన్నాయి.ఇంకా చాలా పార్టీలు చేతులు కలపడం జరిగింది.గత ఎన్నికలతో పోల్చుకుంటే.. నిన్న ఇండియా కూటమి పార్టీలు కూడా సీట్లు, ఓట్లు కూడా బాగానే సొంతం చేసుకున్నాయి. మోడీ నేతృత్వంలోని బీజేపీ పెట్టుకున్న 400 సీట్ల లక్ష్యాన్ని నిలువరించడంలోనూ.. ఏక పక్షంగా 2014, 2019లో వచ్చినట్టు బీజేపీ భారీ సంఖ్యలో సీట్లను కొల్లగొట్టకుండా చేయడంలో కూడా ఇండియా కూటమి బాగానే పనిచేసింది. ఫలితంగా బీజేపీ  293 స్థానాలని దక్కించుకుంది. అయితే.. ఇండియా కూటమికి మాత్రం 233 స్థానాలు వచ్చాయి.ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చేందుకు.. ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతును కూడా ఇండియా కూటమి కోరుకుంటోంది.


ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోని పార్టీలు.. ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ భారీ విజయం సాధించింది. దీంతో టీడీపీ తమతో చేతులు కలుపుతుందనే ఆశలు ఇండియా కూటమిలో బాగా కనిపిస్తున్నాయి.ఈ విషయాన్ని ఉటంకిస్తూ.. మహారాష్ట్ర మాజీ సీఎం, యూబీటీ శివసేన అధ్యక్షుడు అయిన ఉద్దవ్ ఠాక్రే తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలని చేశారు. చంద్ర బాబు నాయుడు ఇండియా కూటమిలో చేరతారని భావిస్తున్నట్టు ఆయన అన్నారు. బీజేపీ వేధింపులకు గురైన వారంతా కూడా తమతో చేతులు కలుపుతారని, ఈ క్రమంలో చంద్ర బాబు కూడా.. ఒకప్పటి మోడీ బాధితుడే కాబట్టి.. తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఇండియా కూటమి సమావేశం తరువాత తమ ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే... ఉద్ధవ్ చెప్పినట్టు.. చంద్రబాబు నాయుడు ఇండియాతో కలుస్తారా? అంటే.. అలాంటి పరిస్థితి లేదని.. టీడీపీ వర్గాలు.. మంగళవారం నుంచి కూడా కూడా గట్టిగా చెబుతున్నాయి. అయినప్పటికీ.. రాజకీయాల్లో శాశ్వత స్నేహితులు ఉండరన్నట్టుగా ఏమైనా జరగొచ్చని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: