జగన్‌కు టెన్షన్‌: వృద్ధులు బాబు ఆఫర్‌కు టెంప్ట్‌ అవుతారా?

ఏపీ పోలింగ్ కు రెండు వారాల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోని విడుదల చేశారు. దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. అద్బుతమని వైసీపీ నాయకులు చెబుతున్నా.. విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. అయితే తటస్థులు, ఏ పార్టీకి చెందని వారిలో మాత్రం బలమైన చర్చ నడిచే అవకాశం ఉంది.

అయితే జగన్ మ్యానిఫెస్టోపై అన్ని వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీటిని రీచ్ కావడంలో ఆయన వెనకపడ్డారనే చెప్పవచ్చు. ఏదో అనుకుంటే ఏదో జరిగిందే అనే తరహాలో.. ఎంతో ఆశిస్తే.. పాత వాటికే కొంత నగదు పెంచి జనాల మీదకి వదిలారు. ప్రజలకు ఎప్పటికప్పుడు కొత్త వాటిపై ఆసక్తి ఉంటుంది. కొత్తగా మాకు ఏం పెట్టారు అనే వారు ఆలోచిస్తారు. అంతే తప్ప బడ్జెట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వారికి అవసరం లేని అంశం.

ఇదే సందర్భంలో చంద్రబాబూ సూపర్ సిక్స్ హామీలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. జగన్ పథకాలతో పాటు కొత్తవాటిని జత చేస్తున్నారు. ఇవి ప్రజలను ఆకర్షిస్తాయి. ఇవి పక్కన పెడితే వైసీపీకి వృద్ధులు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఎందుకంటే పింఛన్ల కోసం పడిగాపులు కాసే పనిలేకుండా ఒకటో తారీఖు వస్తే చాలు. నేరుగా ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇస్తున్నారు.

దీంతో వైసీపీపై సానుకూలత పెన్షన్ దారుల్లో ఉంది. కానీ జగన్ ప్రస్తుతం ఉన్న రూ.3500 పింఛన్ ను ఆఖరి రెండేళ్లలో రూ.250 చొప్పున పెంచి రూ.3500 ఇస్తానని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు రూ.4వేలు ఇస్తామని చెబుతూ.. ఇప్పుడు పింఛన్ రాని వారికి మూడు నెలలది ఒకేసారి కలిపి ఇస్తామని చెబుతున్నారు. ఇది కాస్త టెంప్టింగ్ గా ఉంది. రూ.4వేలు కూడా మొదట నెల నుంచే ఇస్తానని చెప్పడంతో వృద్ధులు దీనికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంది. అందులో చంద్రబాబు రూ.200 పింఛన్ ని రూ.2వేలకు పెంచారు. అందువల్ల వృద్ధులు వైసీపీకి దూరం అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: