కేంద్రంలో గెలుపుపై.. కాంగ్రెస్ అంచనా ఇదేనా?

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా ఎన్నికల హడావిడి నెలకొంది. ఇక అన్ని రాష్ట్రాలలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి  కాగా ఇప్పటికే ఎన్డీఏ కూటమి కేంద్రంలో వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది అన్న విషయం తెలిసిందే. తమ పాలనతో ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలి అనే సంకల్పంతో ముందుకు సాగుతుంది.

 ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా 400 సీట్లలో విజయం సాధిస్తాము అంటూ ఎన్డీఏ కూటమి బల్ల గుద్ది మరీ చెబుతుంది. ఇక ప్రజల్లోకి కూడా ఇదే నినాదంతో ప్రచారం నిర్వహిస్తూ దూసుకుపోతుంది అని చెప్పాలి. ఇక కూటమిలోని అన్ని పార్టీలను కలుపుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. అయితే ఈసారి కేంద్రంలో ఎట్టి పరిస్థితులలో అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనే లక్ష్యంతో ఉంది ఇండియా కూటమి. దీంతో ఈ రెండు కూటముల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కూడా తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే 10 చోట్ల ప్రచారాలు ముగిసి పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఫలితాలపై కాంగ్రెస్ అంచనా ఎలా ఉంది అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని కాంగ్రెస్ నమ్ముతుందట. తప్పనిసరిగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వసిస్తుందట. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉండడం వల్ల ఎన్డీఏ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత సహజం. కాబట్టి ఆ వ్యతిరేకితే తమకు కలిసి వస్తుందని అనుకుంటుందట. మరోవైపు ఎన్డిఏ కూటమిలో ఉన్న మిగతా పార్టీలపై బిజెపి అధిపత్రం చలాయించడంతో  కొన్ని రాష్ట్రాల్లో కమలం పార్టీకి చేదు అనుభవాలు తప్పడం లేదు. ఈ వ్యతిరేకతే ఇక ఇండియా కూటమికి కలిసి వస్తుందని భావిస్తోందట. మొత్తంగా కాంగ్రెస్ 200 స్థానాలలో విజయం సాధిస్తుందని.. కూటమిలోని మిగతా పార్టీలను కలుపుకొని 350 వరకు తప్పక విజయం సాధిస్తామని.. కాంగ్రెస్ అంచనా వేస్తుందట. మరి ఓటర్లు ఏం తీర్పునిస్తారు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: