యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో సింహాద్రి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు. ఇది ఇలా ఉంటే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను మొదట జూనియర్ ఎన్టీఆర్ కోసం కాకుండా బాలయ్య కోసం తయారు చేశాడట. స్టోరీ మొత్తం తయారు అయ్యాక బాలకృష్ణ కు ఈ మూవీ కథను కూడా వినిపించగా ఆయన కథ మొత్తం విని స్టోరీ సూపర్ గా ఉంది. కాకపోతే నేను ఇది వరకు ఇలాంటి కథలతో చాలా సినిమాలు చేశాను. మళ్లీ ఇలాంటి కథతో సినిమా చేస్తే వర్కౌట్ కాదు అన్నాడట. దానితో విజయేంద్ర ప్రసాద్ ఆ సినిమా స్టోరీ ని పక్కన పెట్టేసాడట.
రాజమౌళి ఆ కథతో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా తీయాలి అనుకున్నాడట. అందులో భాగంగా సింహాద్రి మూవీ కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించగా ఆయన ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక అద్భుతమైన అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా భూమిక చావ్లా , అంకిత హీరోయిన్లుగా నటించారు.
ఇకపోతే ఒకా నొక ఇంటర్వ్యూ లో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ... సింహాద్రి మూవీ కథను మొదట బాలయ్య కోసం తయారు చేశాను. ఇక అలా తయారు చేసిన సమయంలో అందులో ముగ్గురు హీరోయిన్ పాత్రలు ఉండేవి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను హీరోగా అనుకున్న తర్వాత కేవలం ఇద్దరు హీరోయిన్లతోనే ఆ సినిమాను రూపొందించాం అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇకపోతే సింహాద్రి మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ , రాజమౌళి ఇద్దరికి కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది.