మంగళగిరి: లోకేష్ కే గెలుపుపై నమ్మకం లేదు..మరి మిగతా వాళ్ళ పరిస్థితి..?

Pandrala Sravanthi
ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రస్తుతం అంతా ప్రలోబాల పర్వమే నడుస్తోంది. ఇంకా కొన్ని గంటల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో  అన్ని పార్టీల నాయకులు సైలెంట్ గా ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే  ఏపీ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు,25 పార్లమెంటు స్థానాల్లో  పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రజలందరి చూపు మాత్రం ఈ 4 నియోజకవర్గాల పై మాత్రమే పడింది.  ఇందులో జగన్ పోటీ చేస్తున్న పులివెందుల,చంద్రబాబు పోటీ చేస్తున్న పులివెందుల,  పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం పడింది. ఇప్పటికే కుప్పంలో చంద్రబాబు గెలుస్తారని కాస్త నమ్మకం వచ్చింది.అలాగే పులివెందులలో జగన్ తప్పక విజయం సాధిస్తారని తెలుస్తోంది.

 కానీ చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్నటువంటి మంగళగిరిలో మాత్రం చాలా ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయి.లోకేష్ విజయంపై ఇంకా డౌట్ గానే ఉంది.అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఆయన ఎందుకు డౌట్ పడుతున్నారు అనే విషయాలు చూద్దాం.  మంగళగిరి నుంచి లోకేష్ ఇప్పటికే రెండోసారి బరిలో ఉన్నారు. కానీ ఈసారి ఎలాగైనా గెలవాలని కసి తో ఉన్నారు. దానికోసం ఆయన గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో అనుబంధాన్ని పెంచుకున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్నారు.  అయినా మంగళగిరి ప్రజలకు మాత్రం లోకేష్ పై నమ్మకం కలగడం లేదట. ఆయన కేవలం డబ్బుతోనే ప్రజలను కొనాలని చూస్తున్నాడని,  అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదనే ఒక అపోహ ప్రజల్లో ఉందట. ఈయనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మురుగుడు లావణ్య  మహిళా ఓట్లను కవర్ చేస్తూనే, చంద్రబాబు లోకేష్ పై విమర్శలు స్పందిస్తూ వస్తోంది.

వాళ్లు అధికారంలోకి వస్తే ఉన్న పథకాలు ఆగిపోతాయి.అంతేకాకుండా ఏదో టైం పాస్ కి నియోజకవర్గం లో ఆయన పోటీ చేస్తున్నారనే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. మరోసారి జగనన్న వస్తే ఉన్న పథకాలు కొనసాగించడమే కాకుండా అభివృద్ధి జరుగుతుందని ఆమె ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఈ విధంగా మంగళగిరి ప్రజలంతా వైసీపీ వైపు మగ్గుతుండడంతో  లోకేష్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఏనాడు ఇంటి నుంచి బయటకు రాని తన భార్యను కూడా  మంగళగిరి కి తీసుకువచ్చి పూర్తిస్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పజెప్పారు. ఒకవేళ లోకేష్ కు ఓటమి భయం లేకపోతే ఇలా ఎందుకు చేస్తారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే మాత్రం లోకేష్ ని ఒక మహిళ అభ్యర్థి చుక్కలు చూపిస్తోందని చెప్పుకోవచ్చు. అందుకే మంగళగిరి లో లోకేష్ తన అనుచరులతో  ఓట్లకు నోట్లు పంచే పనిలో పడ్డారట.మరి చూడాలి అక్కడి ప్రజలు లోకేష్ కు ఓటు వేస్తారా లేదంటే మురుగుడు లావణ్యను అసెంబ్లీకి పంపిస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: