రేపే పోలింగ్.. భారీ బందోబస్తు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే?

praveen
మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల్లో నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపించిన ఎన్నికల హడావిడి ఇప్పుడు మూగబోయింది. ఇక ప్రచారానికి డెడ్లైన్ ముగియడంతో ఇక ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఈ క్రమంలోనే మే 13వ తేదీన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. అదే సమయంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా అటు ఉపఎన్నిక అదే రోజు జరగబోతూ ఉండడం గమనార్హం.

 ఇలా ఎన్నికల పోలింగ్కు సంబంధించిన పూర్తి వివరాలు చూసుకుంటే..  రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలతోపాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుండగా.. ఎన్నికల విధుల్లో మొత్తం 2 లక్షల 91 వేల మంది సిబ్బందిని పాల్గొనబోతున్నారు.

 ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా  35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పార్లమెంట్ సిగ్మెంట్‌లో 3 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో సాయింత్రం 4.00 గంటల వరకే పోలింగ్ జరగనుంది. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్‌కు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు.
మే 11 సాయంత్రం 6 గంటల నుండే రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మే 13 సాయంత్రం 6 గంటల ఇది అమల్లో ఉంటుంది. ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 73,414 మంది సివిల్ పోలీసులు, 500 తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ విభాగాలు, 164 సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ పోలీసులు బందోబస్తులో ఉండనున్నారు. వీరితో పాటు తమిళనాడుకు చెందిన 3 స్పెషల్ ఆర్మ్స్ కంపెనీలు, 2088 ఇతర శాఖల సిబ్బంది. 7,000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు బందోబస్తు నిర్వహించబోతున్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం తెలంగాణ పోలీసులు భద్రతా తనిఖీ కేంద్రాల నెట్వర్క్ ను ఏర్పాటు చేశారు. ఈ నెట్ వర్క్ 482 ఫిక్స్డ్ స్టాటిక్ టీమ్ లు (FSTలు), 462 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ లు (SSTలు), 89 అంతర్ రాష్ట్ర బోర్డర్ చెక్ పోస్టులు, 173 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. డబ్బు, మద్యం లేదా ఇతర నిషేధిత పదార్థాల అక్రమ రవాణా ప్రయత్నాలను అడ్డుకోవడానికి మొబైల్ పోలీసు విభాగాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: