ప్రతి 11 నిమిషాలకో.. మహిళ హత్య?

Chakravarthi Kalyan
ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ప్రతి 11 నిమిషాలకొక మహిళ లేకుంటే బాలిక.. హత్యకు గురవుతున్నారు. నవంబరు 25న మహిళలపై హింస నివారణ దినం సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఈ వివరాలు వెల్లడించారు. ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకు ఒక మహిళ లేదా బాలిక..భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురవుతోందని ఐక్య రాజ్య సమితి తెలిపింది.

కొవిడ్ 19 మహమ్మారి, ఇతర ఒత్తిడి కారణంగా...ఆడవాళ్లు, ఆడపిల్లలపై శారీరక హింస, తిట్లు పెరిగాయని గుటెర్రస్‌  వివరించారు. ఇది తీవ్ర మానవహక్కుల ఉల్లంఘనగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు జాతీయ కార్యాచరణను అమలు చేసి.. ఈ దారుణాలకు అడ్డుకట్టవేయాలని ఐక్య రాజ్య సమితి కోరింది. ఆన్‌లైన్‌ ద్వారాను మహిళలు, బాలికలు హింసను ఎదుర్కొంటున్నారని ఐక్య రాజ్య సమితి  తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: