టీవీ: భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న బిగ్ బాస్ గీతూ రాయల్..!

Divya
బిగ్ బాస్ రివ్యూస్ ద్వారా యూట్యూబ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది గీతూ రాయల్... ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ -6 లో పాల్గొన్న ఈమె తన అందం అభినయంతో అందరిని మెప్పించింది. ముఖ్యంగా ఈమెకు చిత్తూరు యాస బాగా కలిసి వచ్చింది. దీంతో పలు సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంది గీతూ రాయల్. అప్పుడప్పుడు తన ఫ్రెండ్ ధనుష్ తో కలిసి యూట్యూబ్ వ్లాగ్ కూడా చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా గీతూ హాస్పిటల్ బెడ్డు పైన ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో ఈమె ఒక సమస్యతో బాధపడుతున్నట్లుగా తెలియజేస్తోంది. అందుకు సంబంధించిన విషయాలను తెలుసుకుందాం.

గీతూ రాయల్ మాట్లాడుతూ.. తాను బ్యాంకాక్ వెళ్లి అనేక రకాల ఆహార పదార్థాలు తిన్నారని.. ముఖ్యంగా అక్కడ బొద్దింకలు పిట్టలు వంటివి తిని వచ్చాను ఎందుకంటే తాను చనిపోయే లోపల అన్ని రుచి చూడాలనుకుని ఉద్దేశంతోనే అలా చేశానని అప్పటినుంచి తనకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని.. అలాగే కొంతమంది దేవతల వరకు వెళ్లి దర్శించుకోకుండా వెనక తిరిగి వచ్చానని అది కూడా ఒక కారణం కావచ్చు అని అనుమానం తనలో ఉందని తెలుపుతోంది.తన స్నేహితులతో కలిసి తాను ఒకసారి విజయవాడకు వెళ్లాను కానీ అక్కడ అమ్మవారిని దర్శించుకోకుండా అలాగే రావడం జరిగిందని తెలిపింది.

అందుకే తనకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అన్నట్లుగా తెలుపుతోంది. ఐదు నెలల నుంచి తాను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నానని అయితే డాక్టర్లు కోటి మందిలో ఒకరికి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తనకు మాత్రమే వచ్చిందని తెలిపారంటోంది గీతూ రాయల్. దీంతో రెండేళ్ల పాటు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు తెలియజేశారు అంటోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ప్రతి వారము కూడా ఇంజక్షన్ తీసుకోవాలని ఈ సమస్యలతో బాగా ఆలోచించి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అంటూ ఈ వీడియోలో తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: