పవన్ కోసం బరిలో దిగనున్న చిరు..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లో జన సేన అనే రాజకీయ పార్టీ ని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఇక రాజకీయ పార్టీని స్థాపించినప్పటి నుండి పవన్ ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ ను పొలిటికల్ పార్టీ పైనే పెడుతూ ప్రజల్లో తిరుగుతూ వస్తున్నాడు . అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్నాడు . ఇక పోతే మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

\ఇందులో జనసేన పార్టీ టీ డీ పీ , బీజేపీ పార్టీలతో కలిపి పోటీ చేస్తుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో దిగారు. ఈయనకు మద్దతుగా చాలా రోజుల నుండి జబర్దస్త్ నటులు పిఠాపురంలో ప్రచారాలను చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక ప్రచారాలను చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు అయినటువంటి నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా పిఠాపురంలో ప్రచారాలను చేశాడు.

ఇకపోతే చిరంజీవి కూడా తమ్ముడి కోసం తన వంతు సహాయాన్ని చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం మే 5 వ తేదీన పవన్ కళ్యాణ్ కు అలాగే జనసేన కు సపోర్టుగా పిఠాపురంలో చిరంజీవి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు అందుకు సంబంధించిన కసరత్తులు భారీ ఎత్తున ప్రస్తుతం జరుగుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. మరి పవన్ కోసం చిరంజీవి ప్రచారాన్ని చేస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: