ఏంటి.. ఆ స్టార్ హీరో వల్లే అల్లు అర్జున్ ఆ సినిమా చేశాడా..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రెండవ సినిమా ఆర్య. ఇక ఈ సినిమాతోనే అల్లు అర్జున్ హీరోగా మంచు గుర్తింపును తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా గంగోత్రి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అల్లు అర్జున్కి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. రాఘవేంద్రరావు ఖాతాలోకే ఆ గుర్తింపు మొత్తం వెళ్ళింది. అయితే ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్కి ఆఫర్లు ఏవి రాలేదు. 70,80 కథలు విని విసిగిపోయిన అల్లు అర్జున్ అదే సమయంలో ఆర్య సినిమా కథ వచ్చింది అని.. అల్లు అర్జున్ ఇటీవల తెలిపారు. అయితే ఇటీవల ఆర్య సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే .ఇందులో భాగంగానే అసలు ఆర్య సినిమా ఎలా ఇంత మంచి హిట్ అయిందో చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే ఆయన హీరో తరుణ్

 పేరు కూడా బయటికి తీశాడు. అయితే తరుణ్ వల్లే అల్లు అర్జున్కి ఈ సినిమా చేసే అవకాశం దక్కినట్లుగా ఆయన తెలియజేశారు. అయితే ఇందులో ఆ సంఘటన కూడా ఏంటి అన్న విషయాన్ని బయట పెట్టాడు అల్లు అర్జున్. అయితే గంగోత్రి సినిమా తరువాత తనకు అసలు పేరు రాలేదు అని చెప్పాడు బన్నీ. అనేక కథలు విన్నాను అని కానీ ఏ కథ కూడా నచ్చలేదు అని.. మంచి క్రేజీ సినిమాలు వస్తే బాగుంటుంది అని కోరుకునే వాడిని అని ..కానీ నేను అనుకున్నట్లు ఒక్క సినిమా కూడా రాలేదు అని చెప్పాడు. దీంతో నేను చాలా డౌన్ అయిపోయాను అని.. అదే సమయంలో ఇడియట్ వెంకీ సినిమాను చూసాను అని చెప్పాడు బన్నీ. ఇలాంటి సినిమాలు నాకు కూడా వస్తే

 బాగుంటుంది అని అనుకున్నాను అని తెలిపాడు. సరిగ్గా అదే సమయంలో నాకు తరుణ్ ఫోన్ చేశాడు అని చెప్పాడు బన్నీ.. అంతేకాదు మేమిద్దరం మంచి స్నేహితులమని.. తరుణ్ కోసం స్పెషల్ గా వెంకి సినిమాను మళ్లీ షో వేశారు అని ప్రసాద్ ల్యాబ్ లో షో వేశారు అని తరుణ్ కోరిక మేరకు నేను అక్కడికి వెళ్లి సినిమా చూశాను అని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే సుకుమార్ కి ఆర్య సినిమా కోసం అల్లు అర్జున్ ఫిక్స్ అయ్యాడట. ఒకటి రెండుసార్లు అల్లు అర్జున్తో కలిసి సినిమా గురించి డిస్కషన్ కూడా చేశారట. కానీ అల్లు అర్జున్ మాత్రం అసలు ఈ సినిమాకి ఒప్పుకోలేదట. అల్లు అరవింద్ నుండి సినిమాకి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ అల్లు అర్జున్ చుట్టూ తిరిగే అలసిపోయిన సుకుమార్ ఈ సినిమా వద్దు అని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈ సినిమా కథ చిరంజీవి దగ్గరికి వెళ్లడంతో అందరిని ఒప్పించిన చిరంజీవి సినిమా స్టార్ట్ అయ్యేలా చేశారట. అలా తరుణ్ ఫోన్ చేయడం వల్లే సుకుమార్ అల్లుఅర్జున్ ని కలిసి ఈ సినిమా చేశారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: