మిషన్ మోడీ ఫైనల్ ప్రిడిక్షన్... ఎవరికి ఎన్ని సీట్లు తెలుసా..?

Pulgam Srinivas
నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇక ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగని స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం నమోదు అయ్యింది. దానితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగా పోటీలోకి దిగిన వైసీపీ పార్టీ ఆ ఓటింగ్ శాతం పెరగడం మాకు మంచిదే అని , ఆ ఓట్లు అన్ని మాకే పడ్డాయి. మేమే విజయం వైపు దూసుకు వెళుతున్నాము అని వారు చెబుతూ ఉంటే , ఇక కూటమి సభ్యులు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని ఓడించడం కోసం భారీ స్థాయిలో ఓటర్లు ముందుకు వచ్చారు అని , వారంతా మాకు ఓటు వేశారు. మేము అధికారం లోకి రాబోతున్నాము అని వీరు చెబుతున్నారు.

ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు బలమైన వర్గాలు అయినటువంటి వైసీపీ , కూటమి ఓటింగ్ శాతం పెరగడాన్ని పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళుతున్నారు. ఇకపోతే తాజాగా మిషన్ మోడీ ఫైనల్ ప్రొడక్షన్స్ ప్రకారం వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి పార్టీకి ఎన్ని సీట్లు దక్కబోతున్నాయి ... ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయంపై ఓ ప్రీడక్షన్ చేశారు. దాని ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే విషయం తెలుసుకుందాం. మిషన్ మోడీ ప్రొడక్షన్ ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 72 నుండి 75 ఎమ్మెల్యే సీట్లు రానున్నట్లు , అలాగే టీడీపీ పార్టీకి సొంతగా 85 నుంచి 89 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి అని , మొత్తంగా కూటమికి 101 నుండి 105 సీట్ల వరకు వస్తాయి అని అంచనా వేశారు.

అలాగే కూటమి ఎంపీ లు 14 నుండి 16 మంది గెలుస్తారు అని అంచనా వేశారు. ఇకపోతే టీడీపీ కి సొంతగా 86 నుండి 89 సీట్లు రావడం కూటమి కి 101 నుండి 105 సీట్లు వస్తాయి అన్న నివేదిక ప్రకారం చూసుకున్నట్లు అయితే జనసేన , బీజేపీ కి కలిసి 11 నుండి 15 సీట్ల వరకు రాబోతున్నట్లు మిషన్ మోడీ ఫైనల్ ప్రిడిక్షన్ అంచనా వేస్తోంది. మరి ఈ అంచనా ఎంత వరకు కరెక్ట్ అవుతుందో తెలియాలి అంటే రిజల్ట్ డే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: