డేరింగ్ అండ్ డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో
బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే ఎన్నో ఫ్లాప్ సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు. కానీ ఎప్పుడు ఫ్లాప్ వచ్చిన కూడా ఆ తర్వాత చాలా జాగ్రత్తగా సినిమాకు దర్శకత్వం వహిస్తూ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటాడు. గత కొంత కాలం
పూరి జగన్నాథ్ కు వరుసగా అపజయాలు వచ్చాయి. దానితో ఈయన
రామ్ పోతినెని హీరోగా ఈస్మార్ట్
శంకర్ అనే మూవీని రూపొందించాడు.
ఈ
మూవీ అద్భుతమైన విజయం అందుకోవడంతో
పూరి మళ్లీ తిరిగి కం బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత
విజయ్ దేవరకొండ తో లైగర్ అనే పాన్
ఇండియా మూవీ ని రూపొందించాడు. ఈ
మూవీ ఘోర పరాజయాన్ని అందుకుంది. దీనితో ప్రస్తుతం ఈ దర్శకుడు ఈస్మార్ట్
శంకర్ మూవీ కి కొనసాగింపుగా డబల్ ఈస్మార్ట్ అనే
మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాపై
ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. డబల్ ఈస్మార్ట్
మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యం లో
పూరి తన తదుపరి
మూవీ కి సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ హీరోను కూడా ఇప్పటికే ఈ
డైరెక్టర్ ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితమే హనుమాన్
మూవీ తో సూపర్
సక్సెస్ ను అందుకొని ప్రస్తుతం
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న
తేజ సజ్జ హీరోగా
పూరి జగన్నాథ్ తన తదుపరి
మూవీ ని చేయబోతున్నట్లు అందుకు సంబంధించిన కథ పనులు ప్రస్తుతం
పూరి జగన్నాథ్ పూర్తి చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. నిజంగానే ఈ కాంబోలో
మూవీ కనక సెట్ అయితే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.