ఏపీ: చంద్రబాబును భారీ మెజారిటీతో గెలిపించింది వాళ్లేనా..??

Suma Kallamadi
ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ ఎన్నికలలో చంద్రబాబుకి చాలా పెద్ద సంఖ్యలో ఓట్లు పడ్డాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, విదేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు, విద్యావంతులు, బాగా చదువుకున్న వారు, బెనిఫిషరీలు మొత్తం చంద్రబాబుకి ఓటు వేశారని టాక్ నడుస్తోంది. అలాగే పెన్షన్ రూ.4,000 ఇస్తానని బాబు చెప్పడం వల్ల వృద్ధులు ఆయనకే ఓట్లు గుద్దారని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఓట్లు విప్పడమే మిగిలింది అనధికారికంగా చంద్రబాబు ఆల్రెడీ గెలిచేసారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అయితే పైన చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా నిజం కాకపోవచ్చు. చంద్రబాబుని వీళ్లే గెలిపించారంటూ ప్రస్తుతం ప్రచారం చేస్తున్నది పచ్చ మీడియా మాత్రమే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ, ఈటీవీ ఛానెల్స్‌, టీడీపీ అనుకూల సోషల్ మీడియా చంద్రబాబు ఆల్రెడీ గెలిచేసారు అన్నట్లు ప్రచారాలు మొదలుపెట్టాయి. ప్రభుత్వ ఉద్యోగులలో సగం మంది చంద్రబాబు వైపు ఉన్న మాట వాస్తవమే. ఎన్నారైలలో బాబుకు ఎంతమంది ఓటేశారో తెలియదు. ఈ రెండు కమ్యూనిటీల ఓట్లు రాష్ట్రంలో ఉన్నది తక్కువే. వీరి ఓట్ల కారణంగా జగన్ ఓడిపోతారని చెప్పలేం. రాష్ట్రంలో కోట్లమంది పేద, మధ్యతరగతి ప్రజలు జగన్ పరిపాలన వల్ల చాలా లబ్ది పొందారు. వాళ్లొక్కరు చాలు జగన్ ని భారీ మెజారిటీతో గెలిపించడానికి అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
 ఇక వృద్ధులు రూ.4,000 ఆశపడి చంద్రబాబుకి ఓటు వేశారని ప్రచారం చేయడంలో అర్థం లేదు. చంద్రబాబు అద్భుతమైన హామీలు ఆశ చూపి చివరికి మోసగిస్తారని వృద్ధులకు తెలిసినట్లు మరెవరికి తెలిసి ఉండదు. ఆయన హయాంలో పెన్షన్లు ఎలా వచ్చాయో కూడా వాళ్లకి ఐడియా ఉండి ఉండే ఉంటుంది. ఇంటికి వచ్చి మరీ నెల నెలా పెన్షన్లు అందించే జగన్ ను కాదని చంద్రబాబుకి ఓటేస్తే వారికే పెద్ద చిల్లు పడుతుంది. ఆ మాత్రం అవగాహన ముసలివారికి లేకుండా పోదు కాబట్టి పచ్చ మీడియా గెలుపు తమదే అని డప్పు కొట్టుకోవడం తప్ప ఆయన గెలిచారని ధ్రువీకరించడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: