రష్మికను స్పాట్లో ఇరికించిన ఆనంద్ దేవరకొండ..!!

murali krishna
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం 'గంగం గణేశా' మూవీ మే 31న విడుదలకు రెడీ అవుతోంది.ఈ నేపథ్యంలో ఆయన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశాడు. అందులో భాగంగానే ఈ మూవీలో తన ఫ్రెండ్ గా నటించిన ‘జబర్దస్త్’ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో ర్యాండమ్ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో ఇమ్మాన్యుయేల్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానం చెప్పాడు. తాజాగా నిన్న రాత్రి గం గం గణేశా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా రష్మిక మందన్న గెస్ట్ గా వచ్చింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ – రష్మిక మధ్య ఏదో ఉందని వార్తలు రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. రష్మిక రెండోసారి ఆనంద్ సినిమా ప్రమోషన్స్ కోసం రావడంతో ఈ ఈవెంట్ పై అందరికి ఆసక్తి ఏర్పడింది.
ఇక ఈవెంట్లో రష్మికని పలు ప్రశ్నలు అడిగాడు ఆనంద్ దేవరకొండ. ఇటీవల రష్మిక పలు పెట్ డాగ్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. వాటిలో రష్మిక పెట్ డాగ్, విజయ్ పెట్ డాగ్ కూడా ఉన్నాయి. ఆ ఫోటోలు చూపించి వాటిలో ఏది ఫేవరేట్ అని అడగ్గా రష్మిక.. ఆరా(రష్మిక పెట్ డాగ్) నా ఫస్ట్ బేబీ, స్టార్మ్(విజయ్ పెట్ డాగ్) నా సెకండ్ బేబీ అని చెప్పడం గమనార్హం.ఈ ఈవెంట్లో ఆనంద్ కాసేపు యాంకర్ అవతారమెత్తాడు. తన కాబోయే వదినను కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్న అడిగాడు. "ఈ దేశంలో వచ్చిన కొన్ని అత్యుత్తమ సినిమాల్లో నువ్వు కూడా ఓ భాగమయ్యావు కదా. మరి నీ ఫేవరెట్ కోస్టార్ ఎవరు" అని ఆనంద్ అన్నాడు.
ఆ ప్రశ్న వినగానే వెనుక ఉన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా గట్టిగా అరిచారు. రష్మిక కూడా తన ముందున్న మైక్ ను కాస్త పక్కకు పెడుతూ నీయబ్బ అని ఆనంద్ ను తిట్టింది. రష్మికను భలే స్పాట్ లో పెట్టావు కదా అని స్టేజ్ మీద ఉన్న యాంకర్ అనడం వినొచ్చు. తర్వాత రష్మిక మాట్లాడుతూ.. "ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా స్పాట్ లో పెట్టొచ్చా" అని నవ్వుతూ అడిగింది.ఆలోపే వెనుక నుంచి ఫ్యాన్స్ రౌడీ.. రౌడీ.. అంటూ అరవడం మొదలు పెట్టారు. అవును.. రౌడీ బాయ్.. విజయ్ అని రష్మిక సిగ్గుపడుతూ చెప్పింది. దీనికి ఆనంద్ స్పందిస్తూ.. రౌడీ కాకపోయినా.. చిన్న రౌడీ అని చెప్పొచ్చు అని అన్నాడు. సరే చిన్న రౌడీయే అని రష్మిక అన్నది. దీంతో హాలంతా అరుపులతో మార్మోగిపోయింది. వీళ్ల ఫన్నీ చాట్ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఆ తర్వాత ఆనంద్, రష్మిక కలిసి మూవీలోని పాటపై స్టెప్పులు కూడా వేశారు.విజయ్, రష్మిక లవ్ స్టోరీ చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. ఇప్పటికీ ఈ ఇద్దరూ తమ మధ్య ఉన్న బంధాన్ని అఫీషియల్ గా బయటపెట్టకపోయినా..

 తాము రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా చాలాసార్లే హింట్ ఇచ్చారు. ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడం, పండగలు జరుపుకోవడంతో ఫ్యాన్స్ వీళ్ల మధ్య ప్రేమ గట్టిగానే ఉందని ఫిక్సయ్యారు. ఇక తాజాగా విజయ్ తమ్ముడు ఆనంద్ ను పట్టుకొని పబ్లిగ్గా నువ్వు నా ఫ్యామిలీ రా అని అనడంతో రష్మిక తమ బంధాన్ని చెప్పేసినట్లే అని స్పష్టమవుతోంది.ఇక ఈ గం గం గణేశా సినిమా ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక హీరోయిన్స్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, బిగ్‌బాస్ ప్రిన్స్ యావర్ ముఖ్య పాత్రలు చేశారు.ఇప్పటికే గం గం గణేశా సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: