టీజర్: రొమాంటిక్ కామెడీతో అదరగొట్టేసిన రవితేజ..!
సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి కాగా , ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్ ని విడుదల చేసారు. ఇది రొమాంటిక్ కామెడీతో ఆడియన్స్ ని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. టీజర్ విషయానికి వస్తే.. వెన్నెల కిషోర్ సైకాలజిస్ట్ దగ్గరికి ఎందుకు సార్ అని అడగగా? రవితేజ నేను రెండుసార్లు చెప్పలేను. అక్కడే చెబుతా విను అని చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఆషికా రంగనాథ్ ఎంట్రీ యూత్ ని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో మరింత గ్లామర్ గా కనిపిస్తోంది.
అటు డింపుల్ హయతి కూడా తన గ్లామర్ తో డైలాగులతో మరొకసారి ఆకట్టుకుంటోంది. మొత్తానికి రొమాంటిక్ కామెడీ యాంగిల్ లో ఈ సినిమా రాబోతోంది. ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో రవితేజ చేసే రొమాన్స్ ను కూడా చాలా కొత్తగా చూపించారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కాబోతోంది. అటు ఈ సినిమాతో రవితేజ ఖచ్చితంగా సక్సెస్ కొడతారని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఎదురు చూడాల్సిందే.