మా పేరెంట్స్ వల్ల అనేక సినిమా అవకాశాలు కోల్పోయాను... మృణాల్..!

Pulgam Srinivas
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెలుగులో నాని హీరోగా జెర్సీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. దానితో ఈ మూవీ ని హిందీ లో జెర్సీ అనే టైటిల్ తో షాహిద్ కపూర్ హీరో గా ఈ దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో ఈ బ్యూటీ ముద్దు సన్నివేశాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. సీత రామం అనే మూవీ తో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు వరసగా తెలుగులో అవకాశాలు పెరిగాయి. అందులో భాగంగా పోయిన సంవత్సరం హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె తెలుగులో మరో విజయాన్ని అందుకుంది. తాజాగా ఈమె విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ తెలుగు లో ఈమెకు మొట్ట మొదటి అపజయాన్ని తీసుకువచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఆ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా తన తల్లిదండ్రుల వల్ల తాను ఎన్నో సినిమా అవకాశాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చింది.

తాజా ఇంటర్వ్యూ లో మృణాల్ మాట్లాడుతూ ... ముద్దు సన్నివేశాలు ఉన్న సినిమాల్లో తాను నటించేందుకు తల్లిదండ్రులు అంగీకరించేవారు కాదు అని వాటి వల్ల ఎన్నో సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది మృణాల్ చెప్పుకొచ్చింది. నటిగా అక్కడ సన్నివేశం , కథ తాలూకు అవసరాన్ని చూడాల్సి ఉంటుంది. ముద్దు సన్నివేశం ఉంది అని సినిమాలు వదులుకుంటూ వెళ్తే ఇక సినిమాలు చేయడం కష్టం. ఇదే విషయాన్ని మా పేరెంట్స్ కు అర్థమయ్యేలా చెప్పాల్సి వచ్చింది అని తాజాగా మృణాల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: