ఏపీ: భారీ పోలింగ్..2019 కి మించి.. ఎంతంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్ లో నిన్నటి రోజున ఓటర్లు సైతం పోటెత్తారు.. గత రికార్డులను తిరిగి చూస్తే ఈసారి పోలింగ్ మరింత ఎక్కువగా జరిగింది.. అయితే ఓటు ఎవరికి పడిందనే విషయం ఇప్పుడు అందరిని ఆసక్తికరంగా మారుస్తోంది. ఎవరికి వారు విశ్లేషణతో తమకు అనుకూలంగానే ప్రచారం చేసుకుంటున్నాయి పలు రకాల పార్టీలు.. ముఖ్యంగా బెట్టింగ్ రాయుళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ నాడి పట్టు చిక్కడం లేదు.. గత ఎన్నికలలో పోలింగ్ విషయానికి వస్తే..79.74 శాతం అయ్యిందని కానీ ఈసారి ఈ రికార్డును సైతం తిరగరాసినట్టుగా తెలుస్తోంది.
 కోనసీమ జిల్లాలో 83.19
అల్లూరి జిల్లాలో 63.19
ఏలూరు జిల్లాలో 83.04
సత్యసాయి జిల్లాలో 82.77
చిత్తూరు జిల్లాలో 82.65
ప్రకాశం జిల్లాలో 82.40
బాపట్ల జిల్లాలో 82.33
కృష్ణా జిల్లాలో 82.20
అనకాపల్లి జిల్లాలో 81.63
ప.గో. జిల్లాలో 81.12
నంద్యాల జిల్లాలో 80.92
విజయనగరం జిల్లాలో 79.41
తూ.గో.జిల్లాలో 79.31
అనంతపురం జిల్లాలో 79.25
ఎన్టీఆర్ జిల్లాలో 78.76
కడప జిల్లాలో 78.72
పల్నాడు జిల్లాలో 78.70
నెల్లూరు జిల్లాలో 78.10
తిరుపతి జిల్లాలో 76.83
కాకినాడ జిల్లాలో 76.37
అన్నమయ్య జిల్లాలో 76.12
కర్నూల్ జిల్లలో 75.83
గుంటూరు జిల్లాలో 75.74
శ్రీకాకుళం జిల్లాలో 75.41
మన్యం జిల్లాలో 75.24
విశాఖ జిల్లాలో 65.50

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  రాష్ట్ర వ్యాప్తంగా 81.3% పోలింగ్
పోస్టల్ బాలట్ కలుపుకుంటే ఇది 83% దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే ఓటింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా పడిందా లేక వ్యతిరేకంగా పడింద అనే విషయం ఇప్పుడు సర్వాత చర్చనీయాంశంగా మారుతున్నది. ప్రస్తుతానికైతే ఎవరు లెక్కలతో వారు అంచనాలపై కుస్తీ పడుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా మహిళలు సైతం ఈసారి క్యూ లైన్ లో నిలబడి మరి ఓటు వేస్తున్నారు. ప్రభుత్వ పథకాలను పొందిన వారే ఇలా ఆశీర్వదించారంటూ వైసీపీ చాలా బలంగా నమ్ముతున్నది. చంద్రబాబు కూడా ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని అందుకే ఇలా జరుగుతోందంటే వాదనలు వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: