జగమంత జగన్: ఆ జిల్లాల్లో వార్ వన్ సైడ్.. పక్కా జగనే సీఎం?

Purushottham Vinay
ఏపీలో ఎన్నికలు ఆసక్తికరంగా జరిగిపోయాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎవరికీ ఎక్కువ ఓట్లు పడుంటాయి అనే అంశం జనాల్లో  చర్చనీయాంశంగా మారింది. ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ప్రకారం ఈసారి ఎవరు సీఎం అవుతారో పక్కాగా క్లారిటీ వచ్చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కొన్ని జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయనే చర్చ ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో శ్రీకాకుళం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వైసీపీకి ఎక్కువ ఓట్లు పోల్ అయినట్లు ఇండియా హెరాల్డ్ సర్వే ద్వారా తేలింది. శ్రీకాకుళంలో మాత్రం టీడీపీకి కొంచెం అనుకూల పవనాలు వీచాయని తెలిసింది. ప్రధానంగా విశాఖ, విజయనగరం,గోదావరి జిల్లాలో వైసీపీ మంచి స్కోర్ చేసిందని తెలుస్తుంది.ఇంకా ఇదే క్రమంలో... ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ప్రధానంగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ దాదాపు వార్ వన్ సైడ్ అన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఉందని ఇండియా హెరాల్డ్ ప్రతినిధిల ద్వారా తేలింది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో అయితే ఇంతకాలం అక్కడ బలంగా ఉన్న టీడీపీ పార్టీకి ఇంకా టీడీపీ అభ్యర్థులకు సైతం ఖచ్చితంగా షాక్ లు తప్పకపోవచ్చనే కామెంట్లూ బలంగా వినిపిస్తున్నాయి.

కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఓటర్ల అభిప్రాయం కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది. దీంతో ఇప్పుడు ఏపీలో అధికారంలోకి ఖచ్చితంగా మరోసారి జగన్ మోహన్ రెడ్డి వస్తారని పక్కాగా స్పష్టం అవుతుంది. ఈ ఎన్నికలలో పురుషుల కంటే మహిళలు ఎంతో ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్న పరిస్థితి కనిపించింది.ఎందుకంటే మహిళలకు సీఎం వైఎస్ జగన్ కల్పించిన సాధికారతకు ప్రతి రూపమే ఇలా పోలింగ్ శాతం పెరిగేందుకు నిదర్శనమని తెలిసింది. ప్రధానంగా... అమ్మ ఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, చేయూత లాంటివి మహిళలకే అందించడం వల్ల వైసీపీకి ఓట్లు బాగా పడ్డాయి.ఈ విధంగా... మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎంతగానో కృషిచేయడం వల్ల నేడు జనాల నుంచి వైసీపీకి సానుకూల స్పందన వస్తుంది. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమకు ఎంతగానో మేలు చేసిన వైఎస్ జగన్ ను మరోసారి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జగన్ మోహన్ రెడ్డి గెలిచి సీఎం అవ్వడం పక్కా అంటూ పలు విశ్లేషణలూ తెరపైకి వస్తున్నాయి. క్లాస్ వార్ సౌండ్ కూడా జగన్ కు బాగా కలిసొస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: