బాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వనున్న సౌత్ సినీ క్వీన్ త్రిష..!!

murali krishna
న‌టి త్రిష పేరు తెలియ‌ని సినీ ప్రేమికులు ఉండ‌రు. సినీ పరిశ్ర‌మ‌లో మొద‌ట్లో సైడ్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించి హీరోయిన్‌ స్థాయికి ఎదిగారు. తెలుగులో ఆమె న‌టించిన మొట్ట‌మొద‌టి చిత్రం వ‌ర్షం. ఈ చిత్రం ఎంత‌టి భారీ విజ‌యాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆమె ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా త‌మిళ, మ‌ళ‌యాళంలో కూడా ప‌లు చిత్రాల్లో న‌టించి మంచి పేరు సంపాదించుకున్నారు. త‌న అందం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసారు ఈ ముద్దుగుమ్మ‌. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దాంటానా, ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలు వేరులే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్నారు. ఇక‌, ఈ అమ్మ‌డు న‌ల‌భై ఏళ్ల వ‌యసులో కూడా త‌ర‌గ‌తి అందంతో సినిమాలు చేస్తున్నారు. సెకండ్ ఇన్సింగ్స్‌లో కూడా చేతిలో ప‌లు ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజిగా ఉన్నారు. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్న ఈ అమ్మ‌డుకి తాజాగా మ‌రో ఆఫ‌ర్ అందిన‌ట్లు వార్త‌లోస్తున్నాయి. త్వ‌ర‌లోనే త్రిష బాలీవుడ్‌లోని న‌టించ‌బోతున్న‌ట్లు ఓ న్యూస్ నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది.బాలీవుడ్ సినిమా గురించి ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాలేదు. అయినా ఈ వార్త మాత్రం ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇదిలా ఉండ‌గా, ఓ ప‌క్క చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజి అయిపోయింది ఈ బ్యూటీ. తాజాగా త్రిష న‌టిస్తోన్న మలయాళ చిత్రం 'ఐడెంటిటీ' షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సినిమాకు అఖిల్ పాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా త్రిష‌కు థ్యాంక్స్ చెబుతూ షూటింగ్ స్పాట్‌‌‌‌‌‌‌‌లో దిగిన ఫొటోను దర్శకుడు షేర్ చేశాడు. ఈ సినిమాలో హీరోగా టోవినో థామస్‌‌‌‌‌ న‌టిస్తున్నాడు. ఈ చిత్రం ఒక్క మ‌ళ‌యాళంలో కాకుండా హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.ప్ర‌స్తుతం త్రిష చేతిలో ప‌లు ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో చిరంజీవి స‌ర‌స‌న విశ్వంభ‌ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు మోహన్‌‌‌‌‌‌‌‌ లాల్‌‌‌‌‌‌‌‌కు జంటగా 'రామ్‌‌‌‌‌‌‌‌' అనే మలయాళ చిత్రంలో కూడా నటిస్తోంది. తమిళంలో కమల్ హాసన్‌‌‌‌‌‌‌‌కు జంటగా 'థగ్ లైఫ్‌‌‌‌‌‌‌‌', అజిత్‌‌‌‌‌‌‌‌తో 'విదా ముయార్చి' వంటి సినిమాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: