జగమంత జగన్: రెండోసారి ప్రమాణ స్వీకారం చేసేది ఎక్కడంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో వచ్చేది వైసిపి ప్రభుత్వమే అన్నట్టుగా ఎన్నో రకాల సర్వేలు సైతం వినిపిస్తున్నాయి.. మరొకసారి సీఎంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ కూడా చాలా ధీమాతో తెలియజేశారు. జగన్ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మాలని జగన్ తోనే రాష్ట్రము ప్రజా సంక్షేమం కూడా అభివృద్ధి అవుతుందని ప్రజలు కూడా నమ్మారని తన అభిప్రాయాన్ని తెలియజేశారు బొత్స.. ముఖ్యంగా నిన్నటి రోజున జరిగిన పోలింగ్లో మహిళా ఓటర్లు చురుకుగా పాల్గొన్నారనీ అధికారులు తెలియజేశారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందని ఇప్పుడు మరొకసారి వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని తెలియజేశారు బొత్స. వైసిపి సునామి ముందు నిశ్శబ్దం అంటూ  రకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రజలకు టిడిపి ఇచ్చే హామీలన్నీ ఎన్నికలలో గెలవడానికి వారు చేస్తున్న కుట్రోలని ప్రజలు తెలుసుకున్నారని.. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన టిడిపి చాలా దుష్ప్రచారం చేసిందని అవన్నీ అబద్దాలని అరచి చెప్పిన రైతులు ప్రజలు ఎవరూ కూడా నమ్మలేదని వెల్లడించారు బొత్స. ప్రజలందరూ చిత్తశుద్ధితోనే తమకు మద్దతు పలికారు అనిపిస్తోందని తెలిపారు.

జూన్ 4న ఘనవిజయం సాధించి విశాఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవసారి ప్రమాణస్వీకారం చేస్తారని పండగ లాంటి వాతావరణంలో అందరూ పాల్గొనడానికి సిద్ధంగా ఉండండి అంటూ తెలియజేశారు.. అలాగే ఫ్యాన్ హవాకి సైకిల్ ,గాజు గ్లాసులు ఎగిరిపోతాయని కూడా వెల్లడించారు. 2019 ఎన్నికలలో వచ్చిన ఆ 23 స్థానాలు కూడా 2024లో ఉండవన్నట్టుగా మాట్లాడారు బొత్స.. మరొకసారి జగనే సీఎం పీఠం పైన కూర్చోబెట్టడానికి రాష్ట్ర ప్రజలు కూడా ఫిక్స్ అయ్యారని కూడా వెల్లడించారు. వారు కోరుకున్న విధంగా ఫలితాలు వస్తాయనే నమ్మకం తమకు ఉందని కూడా తెలియజేశారు.. ప్రస్తుతం బొత్స చేసినటువంటి ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి. మరి ఏం జరుగుతుందని విషయం జూన్ 4వ తేదీ వరకు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: